ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు - దక్కేదెవరికో మరి?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 6:48 AM IST

Minorities Votes Impact in Telangana Elections 2023 : మూడో వంతు స్థానాల్లో.. వారే నిర్ణయాత్మకం. రాష్ట్రంలోని 40కిపైగా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా మారారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు సహా కొన్ని చోట్ల ముస్లిం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించడంతో క్రియాశీలకంగా మారనున్నాయి. ఆ సామాజికవర్గం ఓట్ల కోసం బీఆర్​ఎస్​, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023
Minorities Vote In Assembly Election

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు

Minorities Votes Impact in Telangana Elections 2023 : శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మైనార్టీల ఓటుబ్యాంకుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితితోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ మైనార్టీ ఓటుబ్యాంకుపై ప్రధానంగా దృష్టి సారించాయి. రాష్ట్రంలో మైనార్టీల శాతం 14వరకు ఉంది. అందులో 12.7 శాతం ముస్లింలు ఉండగా... మిగతా క్రిస్టియన్లు, ఇతరులు ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల ఓట్లను రాబట్టుకునే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి.

రాష్ట్రంలోని మూడో వంతు నియోజకవర్గాల్లో ముస్లింలు నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్నారు. 40 నుంచి 45 నియోజకవర్గాల్లో వారి సంఖ్య పదివేలకుపైగానే ఉంది. ఏడు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 50 నుంచి 90 శాతం వరకు ఉంటుంది. 22 నియోజకవర్గాల్లో 15 నుంచి శాతం వరకు... 13 నియోజకవర్గాల్లో పది నుంచి 15 శాతం వరకు ముస్లిం ఓట్లు ఉంటాయి.

Minorities Votes in Telangana 2023 : 42 నియోజకవర్గాల్లో ఐదు నుంచి పది శాతం వరకు... మిగిలిన 35 నియోజకవర్గాల్లో రెండు నుంచి శాతం వరకు ముస్లిం ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నాయి. నగరంలోని 15 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు ముస్లింలవే. సహజంగా ఆ నియోజకవర్గాల్లో వారు మజ్లిస్ వైపే ఉండనున్నారు.

బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్​ షా

నాంపల్లిలో కాంగ్రెస్ బలమైన మైనార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌ను బరిలో నిలపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్‌లోనూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పోటీలో నిలిపింది. అటు మజ్లిస్ కూడా ఈమారు జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థిని బరిలో దింపింది. నగరంలో మిగిలిన గోషామహల్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, అంబర్‌పేట్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓట్లు అధికంగా ఉంటాయి. సికింద్రాబాద్‌తో పాటు సనత్‌నగర్‌, కంటోన్మెంట్, ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో క్రిస్టియన్లు ఉంటారు.ఉమ్మడి జిల్లా కేంద్రాలైన కరీంనగర్, వరంగల్ ఈస్ట్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ అర్బన్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు.

Telangana Assembly Elections 2023 : ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఈ సామాజిక వర్గం వారు ఉంటారు. వీటితోపాటు హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి తదితర నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్ల సంఖ్య బాగానే ఉంటుంది. ముథోల్, నిర్మల్, జగిత్యాల, రామగుండం, బోధన్, కామారెడ్డి, బాన్స్‌వాడ, జహీరాబాద్, తాండూరు, గద్వాల, జడ్చర్ల నియోజకవర్గాల్లోనూ నిర్ణయాత్మకంగానే ముస్లిం ఓటర్లు ఉంటారు. ఖానాపూర్, కోరుట్ల, వికారాబాద్, పరిగి, కొడంగల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, భువనగిరి, దేవరకొండ, కొత్తగూడెం, ఎల్లారెడ్డిలోనూ ముస్లిం ఓట్లు కీలకమే.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెబల్స్‌ టెన్షన్‌ - పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల పాట్లు

Special Focus on Minority Voters Telangana : తొమ్మిది స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన మజ్లిస్.. మిగిలిన స్థానాల్లో బీఆర్​ఎస్​కు మద్దతు ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. బోధన్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్‌కు మరోమారు అవకాశం కల్పించిన భారత్ రాష్ట్ర సమితి... పాతబస్తీలో మరో రెండు సీట్లను ముస్లిం మైనార్టీలకు కేటాయించింది. కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బీఆర్​ఎస్​ ప్రధానంగా నమ్ముకొంది.

గురుకులాల ఏర్పాటు, షాదీ ముబారక్, లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. తమ పాలనలో ఎలాంటి మతపరమైన బేధాలు లేవని... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఎలాంటి గొడవలు, కల్లోలాలు లేకుండా పూర్తి ప్రశాంతత ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంతో పోలుస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఈ మారు కూడా ముస్లింలు తమకు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్ మ్యాజిక్‌- అభ్యర్థులు వారే గుర్తులే మారే

Minorities Votes In Telangana Election : కాంగ్రెస్ పాతబస్తీలోని నాలుగు స్థానాలతోపాటు జూబ్లీహిల్స్, నిజామాబాద్ అర్బన్ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలో దింపింది. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు ఎవరికీ టికెట్ ఇవ్వలేదు. లౌకికవాదం కాంగ్రెస్ పార్టీ నినాదమని.. మొదట్నుంచీ ముస్లింలకు అండగా నిలిచింది తమ పార్టీయేనని చెయ్యి పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలుతోపాటు కాంగ్రెస్ హయాంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నారని... ఇటీవలి కర్నాటక ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

బీజేపీ, బీఆర్​ఎస్​, మజ్లిస్ ఒకటేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమారు ఎన్నికల్లో ముస్లింలు కచ్చితంగా అండగా ఉంటారన్న విశ్వాసంతో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నారు.మూడో వంతు స్థానాల్లో కీలకంగా మారిన ముస్లిం మైనార్టీ ఓటుబ్యాంకుపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నాయి. పార్టీ విధానాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా తమకే వారి మద్దతు ఉంటుందని ఆశలు పెట్టుకున్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ హవానే కొనసాగుతుందా? త్రిముఖ పోరు తప్పదా?

రసవత్తరంగా కోదాడ రాజకీయాలు - బీఆర్ఎస్​, కాంగ్రెస్​ మధ్య హోరాహోరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.