తెలంగాణ

telangana

వినూత్న ఆలోచనలు, సరైన ప్రణాళికతోనే విజయాలు తథ్యం: శైలజా కిరణ్‌

By

Published : Mar 8, 2023, 4:34 PM IST

Updated : Mar 8, 2023, 5:16 PM IST

Margadarsi MD In Womens Day celebrations: వినూత్న ఆలోచనలు, సరైన ప్రణాళికతో విజయాలు తథ్యమని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​ అన్నారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతికత లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే స్థాయిలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆమె.. నిత్య జీవితంలో శాస్త్రసాంకేతిక రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించే మహిళ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.

margadarsi MD Sailaja Kiran
margadarsi MD Sailaja Kiran

వినూత్న ఆలోచనలు, సరైన ప్రణాళికతోనే విజయాలు తథ్యం: శైలజా కిరణ్‌

Margadarsi MD In Womens Day celebrations: అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్​లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మఖ్య అతిథిగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ఆదర్శవంతమైన విద్యార్థులు ఎప్పుడు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గౌరవిస్తారని పేర్కొన్నారు.

అలాంటి వారు ఒడుదొడుకులకు భయపడక సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని తెలిపారు. లక్ష్యాలను ఛేదించేందుకు ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందులను అయినా ధైర్యంగా ఎదుర్కొనేలా సర్వత్రా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడం నేర్చుకోవాలని పిలుపునిచ్చిన ఆమె.. వినూత్న ఆలోచనలు, సరైన ప్రణాళికతో విజయాలు తథ్యమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే స్థాయిలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. స్టీల్ ఫ్యాక్టరీలు, లోకోమోటివ్, డిఫెన్స్ వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారి అవసరం ఉందన్నారు. ఏఐ, బిగ్ డేటా ఇంజినీర్, బ్లాక్ చైన్ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్ వంటి వారికి భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. రోబోటిక్స్​కి అన్ని వేళలా అత్యంత విలువ ఉందని తెలిపారు. 'చాలా మంది సులభంగా డబ్బుసాధించివచ్చు అన్న లక్ష్యంతో వ్యాపారాలు ప్రారంభిస్తారు.. కానీ వ్యాపారంలో ఎప్పటికప్పుడు పోటీని గమనించి కష్టపడాలని' సూచించారు.

గొప్ప నిర్ణయాలు, సృజనాత్మక ప్రయోగాలు లేకుండా వ్యాపారం విజయవంతం కాదు: కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. గొప్ప నిర్ణయాలు, సృజనాత్మక ప్రయోగాలు లేకుండా వ్యాపారం విజయవంతం కాదన్నారు. వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తించి వారి పనికి విలువ ఇవ్వాలన్నారు. 'ముందు వారు మనుషులు ఆ తర్వాతే ఉద్యోగులన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి.. అద్భుతంగా పనిచేసిన వారికి రివార్డులు అందించాలని' శైలజాకిరణ్ సూచించారు.

"వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే సరళత్వం, ప్రణాళిక, వ్యవస్థాపక నైపుణ్యాలు ఉండాలి. చాలా మంది కంప్యూటర్లు ఆన్‌ చేసి, తలుపులు తెరిచి.. వ్యాపారం ప్రారంభించేసి.. డబ్బులు సంపాదించవచ్చని అనుకుంటున్నారు. కానీ వ్యాపారంలో డబ్బులు సంపాదించడం.. వారు ఆలోచించినంతా సులువు కాదు. వ్యాపారం ప్రారంభించాలంటే విశ్లేషణాత్మక ఆలోచన, ని‌శ్చితమైన వ్యవస్థ, సమగ్రమైన రికార్డుల నిర్వహణ అవసరం. ప్రత్యర్థులపై అవగాహన ఉండటం మరింత ముఖ్యం. వ్యాపార ఎత్తుగడలు ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని మెరుగుపర్చుకోవాలి. కష్టపడి పనిచేయాలి. వ్యాపారాన్ని ప్రారంభించేప్పుడు వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలంటే వినియోగదారులకు మంచి సేవల్ని అందించడం చాలా ముఖ్యమైంది. నిలకడ అనేది వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి చాలా ప్రధానం". -శైలజా కిరణ్‌, మార్గదర్శి ఎండీ

ఇవీ చదవండి:

అతివలు వీరిని స్ఫూర్తిగా తీసుకోండి.. అనుకున్నది సాధించండి!

సరిలేరు సంగీతకు.. చదివింది నాలుగో తరగతి.. పది మందికి ఉపాధి కల్పిస్తోంది

సాహో జుబేదా.. ఈ 'పవర్‌ఫుల్ ఉమెన్‌' గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే

Last Updated : Mar 8, 2023, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details