తెలంగాణ

telangana

సంక్రాంతి పండుగ కోసం 4,484 స్పెషల్​ బస్సులు - ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 7:09 PM IST

TSRTC Special Buses for Sankranti Festival : సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్​ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. వారికి అనుగుణంగా టీఎస్​ఆర్టీసీ సిద్ధమైంది. ప్రయాణికుల కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలానే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రయాణించే వారు ఉచితంగానే ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.

TSRTC Special Buses Extra Payment
TSRTC Special Buses for Sankranti Festival

TSRTC Special Buses for Sankranti Festival: సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. సంక్రాంతి పండుగకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని ఆర్టీసి ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీ - రేపు కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభం

TSRTC Special Buses Extra Payment :సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసి 4,484 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. అందులో 626 సర్వీస్​లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7వ తేది నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు(Mahalakshmi Scheme in Telangana), ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ హైదరాబాద్​లోని బస్​ భవన్​లో ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

TSRTC Gamyam App : ఒక్క క్లిక్​తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
VC Sajjanar on Sankranti Special Buses : మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసి ఎండీ సజ్జన్నర్ తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జ్​లుగా నియమించామని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని ఆర్టీసి ఎండీ సజ్జన్నర్ స్పష్టం చేశారు.

త్వరలో టీఎస్​ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్​ బస్సులు

Free Ticket for Telangana Women in TSRTC: ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్​లోని వివిధ ప్రాంతాలకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను(TSRTC Special Buses) నడుపుతోందని ఆర్టీసి ఎండీ సజ్జన్నర్ అన్నారు. ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నామన్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని ఆర్టీసి ఎండీ సజ్జన్నర్ పేర్కొన్నారు. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకొని ప్రయాణించాలని సూచించారు.

ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం పడకూడదు - ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి : భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details