తెలంగాణ

telangana

సినీ నటుడు బాలకృష్ణ ఇంటి గేటు వైపు దూసుకెళ్లిన కారు

By

Published : May 18, 2022, 11:59 AM IST

సినీ నటుడు బాలాకృష్ణ ఇంటి గేటు వైపు ఓ కారు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

బాలాకృష్ణ ఇంటి గేటు వైపు ఓ కారు దూసుకువచ్చింది
బాలాకృష్ణ ఇంటి గేటు వైపు ఓ కారు దూసుకువచ్చింది

సినీ నటుడు బాలకృష్ణ ఇంటి గేటు వైపు ఓ కారు దూసుకెళ్లింది. ఫిలింనగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్తున్న వాహనం రోడ్‌ నంబరు 45 కూడలి దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి.. పక్కనే ఉన్న సినీనటుడు బాలకృష్ణ ఇంటి ట్రీగార్డును ఢీకొట్టి నిలిచిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనం నడుపుతున్న యువతికి శ్వాస విశ్లేషణ పరీక్ష చేశారు. ఆమె మద్యం తాగలేదని గుర్తించారు. వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details