ETV Bharat / state

CM KCR Review: కాసేపట్లో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష

author img

By

Published : May 18, 2022, 4:30 AM IST

Updated : May 18, 2022, 10:39 AM IST

CM KCR Review: పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యాచరణ సహా ధాన్యం సేకరణపై సమీక్ష ప్రధానాంశాలుగా కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రగతి భవన్​లో సమీక్షించనున్నారు.

CM KCR Review: పల్లె, పట్టణప్రగతి కార్యాచరణపై ఇవాళ కీలక సమావేశం
CM KCR Review: పల్లె, పట్టణప్రగతి కార్యాచరణపై ఇవాళ కీలక సమావేశం

CM KCR Review: పల్లెప్రగతి, పట్టణప్రగతితో పాటు ధాన్యంసేకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణం, వైకుంఠధామాలు, ప్రకృతివనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రగతి భవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, నగరపాలికల మేయర్లు, కమిషనర్లతో ప్రగతిభవన్​లో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో దఫా పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటి వరకు నిర్వహించిన పల్లె,పట్టణప్రగతి అమలు, పురోగతిని కేసీఆర్ సమీక్షిస్తారు. అందులో చేపట్టిన పనులు, వాటి పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణ, తదితరాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మరో విడత కార్యక్రమాల నిర్వహణ, ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు.

బృహత్ ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణ పురోగతినిని కూడా సీఎం సమీక్షిస్తారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. అందుకు అనుగుణంగా మార్కెట్ల నిర్మాణ పురోగతిపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు. మండలానికి ఒకటి చొప్పున బృహత్ ప్రకృతివనాల అభివృద్ధి, ఊరూరా వైకుంఠధామాల నిర్మాణంపై కూడా సమీక్షిస్తారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి మరో దఫా నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల అంశం కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్​లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతోంది.

యాసంగి సీజన్ కు సంబంధించి కొనసాగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియపైనా నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, ఇంకా వచ్చే ధాన్యం, మిల్లులకు తరలింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కూడా చర్చ జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం కేసీఆర్... ఇవాళ్టి సమీక్ష సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆదాయం, ఆర్థికస్థితిగతులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. హరితహారం, పంటలసాగు, వీటితో పాటు ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :May 18, 2022, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.