తెలంగాణ

telangana

బీఎల్‌ సంతోష్‌, జగ్గు స్వామికి ఇచ్చిన 41ఏ నోటీసుపై స్టే కొనసాగింపు

By

Published : Dec 13, 2022, 5:42 PM IST

Updated : Dec 13, 2022, 6:11 PM IST

MLAs Poaching Case Update :
MLAs Poaching Case Update :

17:33 December 13

బీఎల్‌ సంతోష్‌, జగ్గు స్వామికి ఇచ్చిన 41ఏ నోటీసుపై స్టే కొనసాగింపు

MLAs Poaching Case Update : ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నిందితులతో పాటు బీజేపీ వేసిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని శ్రీనివాస్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్ పేరు చెబితే నిమిషాల్లో విచారణ ముగిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

సిట్​పై నమ్మకం లేదని సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ కేసులో ప్రతిపాద నిందితులుగా ఉన్న బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు జారీ చేసిన 41ఏ నోటీసులపై ఉన్న స్టేను 22వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. 41ఏ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేయడంతో హైకోర్టు వాటిపై స్టే విధించింది.

ఇవీ చదవండి:

Last Updated :Dec 13, 2022, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details