తెలంగాణ

telangana

శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు... గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు

By

Published : Jan 16, 2023, 10:39 AM IST

Shilparamam Sankranthi Sambaralu: శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక అలంకరణలు, ఆకృతులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన కళారూపాలు కట్టిపడేస్తున్నాయి. నిన్న సంక్రాంతి పర్వదినం కావడంతో సందర్శకులు పోటెట్టారు. పండగ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి.

శిల్పారామం
శిల్పారామం

శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు

Shilparamam Sankranthi Sambaralu: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. సంక్రాంతి వేళ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు సందర్శకులను మంత్రముగ్దులను చేశాయి.

"ఈరోజు శిల్పారామంకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈసంవత్సరం పండగకి మా సొంతూరికి వెళ్లడానికి వీలు కాలేదు. ఇక్కడ పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతోంది. మా పిల్లలు బాగా సంతోషంగా ఉన్నారు. శిల్పారామంకు రావడంతో మా గ్రామానికి వెళ్లలేదన్న లోటు తీరింది".- పర్యాటకురాలు

పండుగ రోజు తరలివచ్చిన జనం సేదదీరేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృక కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్టు చూపేలా శిల్పారామంలో అలంకరణలు చేశారు.

"ఇక్కడి హరిదాసు పాటలు, బసవన్న విన్యాసాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మా పిల్లలను ఎంతో అకట్టుకుంటున్నాయి. మా మనువళ్ల అందరిని ఇక్కడికి తీసుకొచ్చాము. వారు ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగు ఎప్పడు వస్తుందని అడుగుతుంటారు. గ్రామంలో ఉండే ఆట పాటలన్నింటిని ఇక్కడ చూడవచ్చు". - పర్యాటకురాలు

సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లలేని వారు శిల్పారామంలోని సంబరాల్లో పాల్గొని... స్వగ్రామాలకు వెళ్లిన అనుభూతి పొందామని తెలిపారు.ప్రత్యేక ఏర్పాటు చేసిన స్టాళ్లలో సందర్శకులు విక్రయాలు జరిపారు. సంక్రాంతి వేళ శిల్పారామానికి అధిక సంఖ్యలో నగరవాసులు తరలిరావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details