ETV Bharat / international

నేపాల్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ వీడియో చూశారా?

author img

By

Published : Jan 16, 2023, 7:02 AM IST

నేపాల్​లో విమానం కూలిన దుర్ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఆ వీడియోలో ఏముందంటే?

nepal plane crash video moments before crash
నేపాల్ విమానం కూలిపోతోన్న వీడియో వైరల్

నేపాల్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. పొఖారా విమానాశ్రయానికి సమీపంలో ల్యాండింగ్​కు ముందు ఈ విమానం కుప్పకూలిపోయింది. అయితే తాజాగా ఇదే విమానానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు ఈ విమానం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి పడిపోతున్నట్లు అందులో కనిపిస్తోంది. అనంతరం పెద్ద శబ్దం వినిపించింది. అయితే ఈ వీడియో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఓ భవనం పైనుంచి తీసినట్లుగా తెలుస్తోంది.

ఆదివారం జరిగిన ఈ దుర్ఘటన కారణంగా నేపాల్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం 'జాతీయ సంతాప దినం' ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. అందులో ఐదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 మంది విదేశీయులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేశారు. ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.