తెలంగాణ

telangana

Revanth Reddy React on Iphone Hack Alerts : " మా ఫోన్లను హ్యాక్ చేయడం.. గోప్యత, రాజకీయ హక్కుల ఉల్లంఘనే"

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 5:26 PM IST

Revanth Reddy React on Iphone Hack Alerts : విపక్ష పార్టీల నేతల ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు వస్తున్న మెసేజ్​లపై .. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘనేనని మండిపడ్డారు.

Rahul Gandhi fires on Iphone Hackalerts
Revanth Reddy React on Iphone Hack Alerts

Revanth Reddy React on Iphone Hack Alerts : ప్రజల హక్కులు, న్యాయం కోసం పోరాడడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక ప్రాధాన్యత అని.. పీసీసీ అధ్యక్షుడురేవంత్​రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. విపక్షనేతల ఐఫోన్‌లను హ్యాక్‌ చేస్తున్నట్లు వస్తున్న మెసేజ్‌లపై.. రేవంత్​రెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. తన ఫోన్​కు వచ్చిన హ్యాక్ మెసేజ్​కు సంబంధించిన స్క్రీన్ షాట్​ను ఎక్స్​లో పంచుకున్నారు.

Apple Warning State Sponsored Attack : 'మా ఫోన్లు హ్యాక్ చేసేందుకు కేంద్రం యత్నం'.. విపక్ష ఎంపీల ఆరోపణలు

Revanth Reddy fires on Hacking Inciddent :అధికార పార్టీలు స్పైవేర్‌ని ఉపయోగించి తమ ఫోన్‌లను అక్రమంగా హ్యాక్ చేస్తున్నారని(Iphone Hack Alerts) రేవంత్​రెడ్డి విమర్శించారు. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యత, మానవ గౌరవం, రాజకీయ హక్కుల ఉల్లంఘనేనని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఇవేవి తమని అడ్డుకోవని.. తమ చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నట్లు తెలిపారు.

Opposition Leaders Received Iphone Hack Alerts : దేశవ్యాప్తంగా విపక్షనేతల ఐఫోన్లపై హ్యాకింగ్​కు పాల్పడుతున్నారంటూ.. యాపిల్​​ నుంచి తమకు వార్నింగ్​ మెసేజ్​లు వస్తున్నాయని.. పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. తమ ఫోన్లపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని సంబంధిత మెసేజ్​లో ఉందన్నారు. తమ ఫోన్లు హ్యాక్​కు గురై.. డేటా చోరీ జరిగే అవకాశం ఉందని యాపిల్​ తమను హెచ్చరించిందని తెలిపారు. యాపిల్​ నుంచి వచ్చిన వార్నింగ్​ స్క్రీన్ ​షాట్లను ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

Rahul Gandhi fires on Iphone Hackalerts : దేశంలో ప్రతిపక్ష నేతలకు యాపిల్​​ నుంచి అందిన వార్నింగ్​ మెసేజ్​లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్​ నాయకులతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలకు కూడా ఇలాంటి మెసేజ్​లు అందాయన్న రాహుల్​.. చాలా మంది ఫోన్లు హ్యాకింగ్ గురవుతున్నాయని ఆరోపించారు.

మరోవైపు ఈ హ్యాక్ మెసేజ్​లపై యాపిల్ సంస్థ స్పందించింది. స్టేట్​ స్పాన్సరెడ్​ అటాకర్ల దాడిని ఎవ్వరికి ఆపాదించమని తెలిపింది. ఈ దాడులు చేసేవారు అధునాతనంగా ఆలోచిస్తారని.. కాలక్రమేణా ఆ దాడులు పెరగొచ్చని పేర్కొంది. తరచూ దాడులను గుర్తించడం కష్టమైన పని అని తెలిపింది. అయితే కొన్ని​ బెదిరింపు నోటిఫికేషన్లు​ తప్పుగా ఉండొచ్చని, కొన్నింటిని పసిగట్టలేకపోచ్చని యాపిల్​ వెల్లడించింది. బెదిరింపు నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి కారణాల గురించి తాము చెప్పలేకపోయామని పేర్కొంది.

Apple Alert Politicians : 'యాపిల్ హ్యాక్ అలర్ట్​లపై దర్యాప్తునకు ఆదేశించాం.. విపక్షాలకు పని లేకే ఇలా..'

Data Leak ICMR : దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 81 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు హ్యాక్​

ABOUT THE AUTHOR

...view details