ETV Bharat / bharat

Apple Alert Politicians : 'యాపిల్ హ్యాక్ అలర్ట్​లపై దర్యాప్తునకు ఆదేశించాం.. విపక్షాలకు పని లేకే ఇలా..'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 4:07 PM IST

Updated : Oct 31, 2023, 5:58 PM IST

Apple Alert Politicians : తమ ఐఫోన్లను కేంద్రం హ్యాక్‌ చేసేందుకు యత్నిస్తోందన్న విపక్ష నేతలు ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ మండిపడ్డారు. దేశాభివృద్ధిని చూడలేని కొందరు.. విధ్వంసక రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే, ఈ సమస్యపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని.. యాపిల్​ పంపిన సదరు అలెర్ట్​ సందేశాలు భారత్​ సహా 150 దేశాలకు వెళ్లాయని మంత్రి పేర్కొన్నారు.

Apple Security Alert Pop Up To Politicians Allegations On Central Govt Union Minister Ashwini Vaishnaw Response
Apple Alert Politicians Union Minister Ashwini Vaishnaw Response

Apple Alert Politicians : ప్రభుత్వ ఆధ్వర్యంలోని హ్యాకర్ల ద్వారా తమ ఫోన్లపై దాడులు జరుగుతున్నట్లు విపక్ష నేతలు ఆరోపించిన వేళ.. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వారిపై ఎదురుదాడికి దిగారు. దేశాభివృద్ధిని చూడలేని కొందరు నాయకులు.. విధ్వంసక రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. యాపిల్ నుంచి వచ్చిన హ్యాక్​ అలర్ట్​ సందేశాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని.. అయితే యాపిల్​.. ఫోన్​ హ్యాకింగ్​ హెచ్చరిక సందేశాలు భారత్​లోని యూజర్స్​కు మాత్రమే పంపలేదని, 150 దేశాల్లో ఉన్న ఐఫోన్​​ యూజర్లకూ ఈ రకం మెసేజ్​లు పంపించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అంతకుముందు ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ మెయిల్​ ఇచ్చింది యాపిల్​. 'మేము పంపిన థ్రెట్​ నోటిఫికేషన్​ ఏ వ్యక్తికి గానీ, సంస్థకు గానీ ఆపాదించబడింది కాదు' అని స్పష్టం చేసింది.

  • #WATCH | On Apple's 'state-sponsored attack' message to some Opposition members, Union Minister for Communications, Electronics & Information Technology Ashwini Vaishnaw says, "The government is concerned about this issue and it will go to the bottom of it. There are some… pic.twitter.com/32B3DYYheX

    — ANI (@ANI) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మనుగడ సాధించడం కోసమే..'
'దేశంలో కొందరు విమర్శకులు ఉన్నారు. వారికి ఏ పనీ ఉండదు. వారి ఏకైక లక్ష్యం మనుగడ సాధించడమే. కొద్ది సంవత్సరాల క్రితం కూడా కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అప్పుడు పూర్తి విచారణ జరిపాం. న్యాయస్థానం పర్యవేక్షణలో ఈ దర్యాప్తు సాగింది. దాని ద్వారా ఎలాంటి అవకతవకలు వెలుగులోకి రాలేదు. ప్రియాంక గాంధీ.. తన పిల్లల ఫోన్లు హ్యాక్ అయ్యాయని ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని తేలింది. ఇదంతా వారు చేసే తప్పుడు ప్రచారమే. అలాగే భారత ప్రభుత్వం పౌరులందరి గోప్యత, భద్రతను చాలా సీరియస్‌గా పరిరక్షిస్తుంది. తాజా పరిణామాలపై మేము విచారణకు ఆదేశించాము. ఈ విషయంలో యాపిల్​ సంస్థ సహాయం కూడా తీసుకుంటాము. వారినీ దర్యాప్తు ప్రక్రియలో చేరమని కోరాము' అని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు.

  • "The Government of Bharat takes its role of protecting the privacy and security of all citizens very seriously and will investigate to get to the bottom of these notifications. In light of such information and widespread speculation, we have also asked Apple to join the… pic.twitter.com/PVnx4NXZGm

    — Press Trust of India (@PTI_News) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"యాపిల్​ పంపిన హ్యాక్​ అలర్ట్​ మెసేజ్​.. కేవలం మన దేశం యూజర్లకు మాత్రమే కాదు. సుమారు 150 దేశాల ఐఫోన్​​ యూజర్లకు కూడా అందింది. అయితే ఈ సమస్యపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ దేశంలోని కొందరు ప్రతిపక్ష సభ్యులు నిరాధార విమర్శలు చేస్తున్నారు. దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు విధ్వంసక రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారి గురించి, వారి కుటుంబాల అభివృద్ధి గురించి మాత్రమే పనిచేశారు. యాపిల్ పంపిన మెయిల్‌లో మాకు స్పష్టమైన సమాచారం అందలేదు. ఒక అంచనా ఆధారంగా వారు ఈ హెచ్చరికలు మాత్రం పంపారని అర్థమవుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ నిరాధారమైన ఆరోపణల్లో నిజం లేదని యాపిల్​ కూడా ఒక​ క్లారిటీ మెయిల్​ పంపింది."

- అశ్విని వైష్ణవ్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

'రాహుల్​ జీ వారితో కలవద్దు..'
ఈ హ్యాక్​ వ్యవహారంపై కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీకి చురకలు అంటించారు బీజేపీ లీడర్​ గౌరవ్​ భాటీయా. 'రాహుల్​ జీ మీ మొబైల్​ ఫోన్​ను మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎలాంటి దేశ విద్రోహ శక్తులతో మీరు పొత్తు పెట్టుకోవద్దు. అలాగే దేశ పౌరుడికి భంగం కలిగించే ఎటువంటి వెబ్​సైట్​ను మీరు యాక్సెస్​ చేయవద్దు' అని ఆయన రాహుల్​పై సెటైర్లు విసిరారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష నాయకులు ఫోన్‌లో మాల్‌వేర్‌ ప్రవేశించడానికి ప్రధాన కారణం వారు చూసే కంటెంటే అన్ని గౌరవ్​ భాటీయా అన్నారు. వీరంతా తమ డివైజుల్లో తప్పుడు కంటెంట్​ను చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • #WATCH | On Apple's 'state-sponsored attack' message to some Opposition members, BJP leader Gaurav Bhatia says, "Rahul Gandhi, I would like to request you to make good use of your mobile phone. Don't forge an alliance with any such anti-national force or don't access any such… pic.twitter.com/YxkWBnnvvA

    — ANI (@ANI) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'వారే చిలిపిపని చేశారేమో..'
'యాపిల్​ పంపిన డివైజ్​ హ్యాక్​ అలర్ట్​ సందేశాలపై కొందరు నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాపై విమర్శలు చేయడానికి బదులుగా వారి బలహీనతలను గుర్తిస్తే బాగుంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉంది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అసలు ప్రభుత్వం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి యాపిల్ సంస్థ కూడా స్పష్టతనిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు కూడా యాక్టివ్‌గా ఉన్నారు. వారిపని ఎందుకు కాకూడదు. ఏదైమైనా దీనిపై విచారణ జరుగుతోంది. ఇందులో యాపిల్​ని కూడా చేరమని కోరాం. ఎమైనా సమస్యలు ఎదురైతే నాయకులు అధికారికంగా ఫిర్యాదు చేయాలి. అందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బహుశా ప్రతిపక్ష నేతలెవరైనా ఈ చిలిపిపని చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను' అని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు.

  • #WATCH | Apple's 'state-sponsored attack' message to some Opposition leaders | Union Minister Piyush Goyal says, "I think Opposition is going through a very weak phase these days, so they see conspiracy in everything. The reality is that Apple has itself cleared that this was… pic.twitter.com/a3cOQKlrbz

    — ANI (@ANI) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎక్స్​లో స్క్రీన్​షాట్లు షేర్​..
అంతకుముందు తమ ఐఫోన్‌ డివైజ్​లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని.. అందుకనే యాపిల్​ నుంచి తమకు హ్యాక్​ అలర్ట్ మెసేజ్​లు వచ్చాయని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని పలువురు ప్రతిపక్ష నేతలు ఎక్స్​ వేదికగా స్క్రీన్‌షాట్‌లను షేర్​ చేస్తూ ఆరోపించారు. వీరిలో తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చదుర్వేది, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్​, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అఖిలేష్ యాదవ్​ సహా ఇతర పార్టీ నేతలు ఉన్నారు.

  • #WATCH | On multiple opposition leaders allege 'hacking' of their Apple devices, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says "From the mail sent by from Apple, it can be understood that they have no clear information, they have sent alerts on the… pic.twitter.com/hSxOJicbwV

    — ANI (@ANI) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Apple Warning State Sponsored Attack : 'మా ఫోన్లు హ్యాక్ చేసేందుకు కేంద్రం యత్నం'.. విపక్ష ఎంపీల ఆరోపణలు

Scorpio Hit And Run in Bangalore : కేసు విత్​డ్రాకు ఒప్పుకోలేదని కారుతో ఢీకొట్టి హత్య.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి..

Last Updated : Oct 31, 2023, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.