తెలంగాణ

telangana

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని పోస్టుకార్డ్ ఉద్యమం.. మోదీకి లక్షలాది ఉత్తరాలు

By

Published : Oct 31, 2022, 6:18 PM IST

Postcard Movement in Hyderabad: చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని తెరాస ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి అబిడ్స్ జీపీవో వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాసిన లక్షలాది పోస్ట్ కార్డులను అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ చేశారు.

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని పోస్టుకార్డ్ ఉద్యమం.. మోదీకి లక్షలాది ఉత్తరాలు
చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని పోస్టుకార్డ్ ఉద్యమం.. మోదీకి లక్షలాది ఉత్తరాలు

Postcard Movement in Hyderabad: మేక్ ఇన్ ఇండియా అంటున్న ప్రధాని మోదీ.. దానిని కేవలం మాటలకే పరిమితం చేస్తూ.. స్వదేశీ వస్తువులకు భారీగా జీఎస్టీ వేస్తున్నారని ఎమ్మెల్సీ ఎల్.రమణ మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చేనేతపై ఎవరూ పన్ను విధించలేదని.. ఒక్క మోదీ ప్రభుత్వమే చేనేత రంగానికి పన్ను వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని తెరాస ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి అబిడ్స్ జీపీవో వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ఛైర్మన్‌లు చింత ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు చేనేత కార్మికులు భారీగా పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాసిన లక్షలాది పోస్ట్ కార్డులను అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేతన్నలను చిన్నచూపు చూస్తోందని రమణ పేర్కొన్నారు. గతంలో కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న చేనేత బోర్డులు, పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికలకు ముందే చేనేత జీఎస్టీ ఎత్తివేత జీవో ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

మేక్ ఇన్ ఇండియా అంటున్న ప్రధాని మోదీ దానిని కేవలం మాటలకే పరిమితం చేస్తున్నారు. స్వదేశీ వస్తువులకు భారీగా జీఎస్టీ వేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చేనేతపై ఎవరూ పన్ను విధించలేదు. ఒక్క మోదీ ప్రభుత్వమే చేనేత రంగానికి పన్ను వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నేతన్నలను చిన్నచూపు చూస్తోంది. గతంలో కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న చేనేత బోర్డులు, పథకాలను పునరుద్ధరించాలి. - ఎల్.రమణ, ఎమ్మెల్సీ

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని పోస్టుకార్డ్ ఉద్యమం.. మోదీకి లక్షలాది ఉత్తరాలు

ABOUT THE AUTHOR

...view details