తెలంగాణ

telangana

బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి మరోసారి నోటిఫికేషన్‌

By

Published : Dec 23, 2022, 7:47 PM IST

Notification for Rajiv Swagruha Flats : బండ్లగూడ, పోచారంలో మిగిలిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి అధికారులు మరోమారు నోటిఫికేషన్ జారీ చేశారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వారికి లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు వచ్చే నెల 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

Rajiv Swagruha flats
Rajiv Swagruha flats

Notification for Rajiv Swagruha Flats : హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలో మిగిలిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి అధికారులు మరోమారు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు చోట్లా మిగిలిన ఫ్లాట్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వారికి లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లాట్ల విస్తీర్ణానికి అనుగుణంగా లక్ష, రెండు లక్షలు, మూడు లక్షల రూపాయలను టోకెట్ అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు వచ్చే నెల 18వ తేదీ వరకు గడువు ఇవ్వగా.. బండ్లగూడలో ఒక పడకగది ఫ్లాట్లు 364, సీనియర్ సిటిజెన్ ఫ్లాట్లు 43 మిగిలి ఉన్నాయి. పోచారంలో మూడు పడక గదుల ఫ్లాట్లు 16, రెండు పడక గదుల ఫ్లాట్లు 570, ఒక పడకగది ఫ్లాట్లు 269 మిగిలి ఉన్నాయి. www.hmda.in, www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ లలో ఫ్లాట్లు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచారు.

Rajiv Swagruha flats

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details