తెలంగాణ

telangana

NIA Officials Conducted Search in Telangana : కోయంబత్తూరు బాంబు దాడి కేసులో.. తెలంగాణ, తమిళనాడులో ఎన్​ఐఏ సోదాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 5:50 PM IST

NIA Officials Conducted Search in Telangana : తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. అందులో భాగంగా 31 చోట్ల తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలు, నగదు, కమ్యూనికేషన్ సామగ్రి, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగా పలువురు ఐసిస్​ సానుభూతిపరులు ముఠాగా ఏర్పడి అమాయక యువకులను ఆకర్షిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు.

Coimbatore Bomb Attack Case
NIA Officials Conducted Search in Telangana

NIA Officials Conducted Search at Hyderabad : జాతీయ దర్యాప్తు సంస్థ(National Investigation Agency) అధికారులు తమిళనాడు, తెలంగాణలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. 31 చోట్ల నిర్వహించిన తనిఖీల్లో కీలక పత్రాలు, ఉగ్రవాద సాహిత్యం, మొబైల్స్, లాప్​టాప్​లతో పాటు రూ.60 లక్షల నగదు.. 18,200 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్(Coimbatore Bomb Attack Case) లో గతేడాది అక్టోబరులో జరిగిన కారు బాంబు దాడి కేసులో భాగంగా ఎన్​ఐఏ(NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా పలువురు ఐసిస్​ సానుభూతిపరులు ముఠాగా ఏర్పడి అమాయక యువకులను ఆకర్షిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు.

Coimbatore Bomb Attack Case : మదర్సాల పేరుతో యువకులకు వాట్సాప్, టెలిగ్రామ్​లలో లింకులు పంపి ఆన్​లైన్​లో శిక్షణ ఇస్తూ.. ఐసిస్ సాహిత్యాన్ని బోధిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. కోయంబత్తూరులో కారు బాంబు దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. వాళ్ల మొబైళ్లు, లాప్​టాప్​లను విశ్లేషించినప్పుడు కీలక విషయాలు బయటపడ్డాయి. దాని ఆధారంగా ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూర్ లో 22చోట్ల, చెన్నై 3, టెంకాసీలో 1, హైదరాబాద్, సైబరాబాద్​లో 5చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

ఎర్రకోట ఉగ్రదాడి దోషికి ఉరే సరి... సుప్రీం కోర్టు ఫైనల్​ డెసిషన్​..!

Terrorist conspiracy foiled in Hyderabad :గతేడాది హైదరాబాద్ జంటనగరాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్ కేంద్రంగా జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం కశ్మీర్ నుంచి గ్రనేడ్లను తీసుకువచ్చి.. అలజడి సృష్టించాలని భావించారు. కానీ ఎక్కడ విధ్వంసం సృష్టించాలని వారికి పాకిస్థాన్ నుంచి సందేహం అందకపోవడం.. వెంటనే ఎన్​ఐఏ ఈ కుట్రను భగ్నం చేయడంతో పెను ప్రమాదమే తప్పింది. హిందూ పండగలు, బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రహస్యంగా ఆపరేషన్‌ చేసి జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ ఫారూక్‌లను అరెస్టు చేశారు.

Islamic Radicals Case : ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు.. భారీ పేలుళ్లకు ప్లానింగ్

HUT Terror Conspiracy in India : అలాగే ఈ ఏడాది దేశంలో భారీ పేలుళ్లకు హెచ్​యూటీ కుట్రలు పన్నింది. అందులో భాగంగా మూడంచెల పద్ధతిలోని అవలంభించారు. వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఈ ఉగ్రదాడి కోసం తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో దాడికి శిక్షణ తీసుకున్నారు. ఈ సమాచారంతో మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్, హైదరాబాద్​లో ఏకకాలంలో దాడులు చేసి ఏకంగా 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు హైదరాబాద్​కు చెందిన వారు ఉన్నారు. ఇందులో నిందితులు తమ కార్యకలాపాల్ని వేగవంతం చేసేందుకు యువతను ఆకర్షించేందుకు ఓ యూట్యూబ్ ఛానెల్​ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మత మార్పిడికి సంబంధించి 33 వీడియోలు.. 3,600 మంది సబ్​స్కైబర్లు ఉన్నారు.

Islamic Radicals case : ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పరారీలో ఉన్న సల్మాన్‌ అరెస్టు

హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు​.. పాకిస్థాన్ గ్రనేడ్లు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details