ETV Bharat / state

Islamic Radicals case : ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పరారీలో ఉన్న సల్మాన్‌ అరెస్టు

author img

By

Published : May 10, 2023, 3:24 PM IST

Updated : May 10, 2023, 9:36 PM IST

Islamic Radicals
Islamic Radicals

15:18 May 10

Islamic Radicals case : ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పరారీలో ఉన్న సల్మాన్‌ అరెస్టు

Islamic Radicals case : ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పరారీలో ఉన్న సల్మాన్‌ అరెస్టు

Hyderabad Islamic Radicals case : ఇస్లామిక్‌ రాడికల్స్‌ సంస్థ కేసులో పరారీలో ఉన్న మహ్మద్‌ సల్మాన్‌ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ అధికారులు హైదరాబాద్‌లో మంగళవారం భోపాల్‌కి చెందిన 11మందిని హైదరాబాద్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో జవహర్‌నగర్‌ పరిధి బాలాజీనగర్‌కు చెందిన సల్మాన్‌ మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ అధికారులకు చిక్కకుండా పరారయ్యాడు. అతన్ని ఇంటిలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.

ఏడాదిన్నర నుంచి నిందితులు ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద సంస్థ హిజ్బ్‌ ఉద్‌ తహరీర్‌తో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. జవహార్‌నగర్ బాలాజీనగర్ శివారు ప్రాంతాల్లోని ఇస్లామిక్ రాడికల్‌కి చెందిన సల్మాన్‌ ఇంటిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించారు. ఇంటికి నలువైపులా సీసీ కెమెరాలు ఉన్నాయన్న అధికారులు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా ఇంటికి ఎత్తైన ప్రహరీ గోడలున్నాయని వివరించారు. ప్రహరీగోడల మీద గాజుపెంకులను సల్మాన్‌ ఏర్పాటు చేసుకున్నాడు. సల్మాన్‌ ఇల్లు దాటి కాస్త ముందుకెళ్లగానే చెట్లు, ముళ్ల పొదలు, గుట్టలు ఉన్నాయి. స్థానికంగా టీవీ మరమ్మతులు చేసే వ్యక్తిగా చలామణి అవుతున్న సల్మాన్‌.. ఉదయం బయటికి వెళ్లి, తిరిగి రాత్రికి ఇంటికి వచ్చేవాడని కాలనీ వాసులు చెప్పారు.

ఇంటి నుంచే ఉగ్ర కార్యకలపాలు: కాలనీల్లో ఎక్కువగా ఇమ్రాన్ బంధువులే ఉన్నారు. ఇమ్రాన్ ఇంటి సీసీ ఫుటేజ్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సల్మాన్‌ ఇంట్లో మంగళవారం పోలీసులు మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సల్మాన్‌ ఇల్లు కేంద్రంగానే ఏమైనా కుట్రలకు పాల్పడ్డారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భోపాల్‌తోపాటు హైదరాబాద్‌లోనూ నిందితులు ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కౌంటర్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆరుగురు కరుడుగట్టిన ఇస్లామిక్ రాడికల్స్‌గా వ్యవహరిస్తున్నట్లు వారి తీరును చూసి పోలీసులు గుర్తించారు.

Terrorists arrested in Hyderabad : అదుపులోకి తీసుకునేటప్పుడు ఏమాత్రం భయం, పశ్చాత్తాపం లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. బోపాల్‌కు చెందిన మహ్మద్ సలీమ్, ఒడిశాకు చెందిన అబ్దుర్ రహమాన్, పాతబస్తీకి చెందిన ఆటో డ్రైవర్ అబ్బాస్ అలీ మత మార్పిడి చేసుకొని ముస్లింలుగా మారినట్లు గుర్తించారు. మతమార్పిడి చేసుకొని ఇస్లామిక్ రాడికల్స్‌గా ఎందుకు వ్యవహరిస్తున్నారనే విషయంపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీల్లీకి చెందిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు హైదరాబాద్‌కు వచ్చి కేసును పర్యవేక్షిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 10, 2023, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.