ETV Bharat / state

హైదరాబాద్​లో ఉగ్రదాడికి కుట్ర.. చార్జ్​షీట్​ దాఖలు చేసిన ఎన్​ఐఏ

author img

By

Published : Mar 29, 2023, 8:43 PM IST

nia
nia

NIA charge seat in Hyderabad terrorist case: హైదరాబాద్​లో ఆర్‌ఎస్‌ఎస్ సభలు, హిందు పండుగలు, శోభాయాత్రలు, దసరా పండగ సమయంలో జన సమూహాల్లో దాడి చేసేందుకు యత్నించిన ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అభియోగ పత్రాలు దాఖలు చేసింది. హైదరాబాద్ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ అభియోగ పత్రాలు దాఖలు చేసింది.

NIA charge seat in Hyderabad terrorist case: గతేడాది సెప్టెంబర్​ నెలలో హైదరాబాద్​లో బాంబు పేలుళ్లలకు కుట్ర పన్నారరే సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అబ్ధుల్ జాహెద్ సహా సమీయుద్దీన్‌, మాజ్ హసన్​లను అరెస్ట్ చేశారు. ఆ కేసు ఆధారంగా కేంద్ర హోం శాఖ అదేశాలతో జనవరిలో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. నిందితులపై సెక్షన్ 120బి, 153ఏ, సెక్షన్ 4,5,6 ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్‌ సబ్‌స్టెన్సెస్‌ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఫర్హతుల్లా ఘోరితో ముగ్గురు నిందితులు సంప్రదింపులు జరిపినట్లు ఎన్​ఐఏ తేల్చింది. ప్రధాన నిందితుడు జాహెద్​తో పేలుళ్లకు రిక్రూట్ మెంట్ చేయాలని చెప్పిన ఫర్హతుల్లా ఘోరి.. అతని ఆదేశాలతో సమీయుద్దీన్‌, మాజ్‌ హసన్​లను రిక్రూట్ చేసుకున్న జాహెద్‌.. పర్హతుల్లాతో పాటు సిద్దికి బిన్‌ ఒస్మాన్​తో కూడా సంప్రదింపులు జరిపినట్లు గుర్తించింది.

జాహెద్​తో సైబర్ స్పేస్​లో సంప్రదిపులు, హవాలా రూపంలో నగదును పర్హతుల్లా ఘోరి, సిద్దికి బిన్‌ ఉస్మాన్‌.. పాకిస్థాన్ నుంచి పంపినట్లు ఆధారాలు సేకరించింది. పేలుళ్లకు 4 హ్యండ్ గ్రనేడ్లను సెప్టెంబర్ 29న హైదరాబాద్ - నాగ్ పూర్ జాతీయ రహదారిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉగ్రవాదులు ఉంచగా ఆ సమాచారాన్ని జాహెద్​కు తెలిపారు. వాటిని స్వయంగా వెళ్లి తీసుకొచ్చిన జాహెద్‌.. సమీయుద్దీన్‌, మాజ్ హసన్​లకు హ్యండ్ గ్రనేడ్ ఇచ్చి తన వద్ద రెండు హ్యాండ్ గ్రనేడ్లు ఉంచుకున్నాడని పేర్కొంది.

కాగా పేలుళ్లకు కుట్ర పన్నిన సమయంలో పక్కా సమాచారంతో జాహెద్‌ ఇంటిపై దాడులు నిర్వహించిన హైదరాబాద్ పోలుసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సమీయుద్దీన్, మాజ్ హసన్​లను అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో 4హ్యాండ్ గ్రనేడ్లు, 20లక్షల నగదు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు నేపథ్యం: హైదరాబాద్‌లో పేలుళ్ల ద్వారా విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైన ముగ్గురిని నగర పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గత ఏడాది అరెస్టు చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ముగ్గురి కదలికలపై డేగ కన్ను వేసిన పోలీసులు నిందితుల కదలికలు పసిగట్టి అరెస్టు చేశారు. హిందు పండగలు, బహిరంగ మీటింగ్​లు, జన సముహాలు లక్ష్యంగా చేసుకొని వీరి దాడులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వీరి నుంచి నీలిరంగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు​.. పాకిస్థాన్ గ్రనేడ్లు స్వాధీనం

లొంగిపోయేందుకు అమృత్​పాల్ రెడీ.. ఆయనతో మీటింగ్ తర్వాతే పోలీసుల వద్దకు..

నకిలీ ఎన్‌ఐఏ అధికారి ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.