తెలంగాణ

telangana

'నడ్డా జీ.. సీఎం పదవి రేటు రూ.2500 కోట్లంట కదా..?'

By

Published : May 7, 2022, 11:01 AM IST

Updated : May 7, 2022, 12:02 PM IST

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై తనదైన శైలిలో ట్విటర్​లో అస్త్రాలు సంధిస్తున్నారు. కర్ణాటకలో సీఎం కావాలంటే వేలకోట్లు ఇవ్వాలన్న భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జేపీ నడ్డాను ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలపై ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

KTR tweet to JP Nadda
కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మంత్రి కేటీఆర్ ట్విటర్​ ద్వారా ప్రశ్నించారు. కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారని భాజపా ఎమ్మెల్యే చెబుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారని మంత్రి ట్విటర్ ద్వారా ప్రశ్నాస్త్రాలు సంధించారు. కర్ణాటకలోని ఆ పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ట్యాగ్ చేశారు.

కేటీఆర్ ట్వీట్
కేటీఆర్ ట్వీట్

కర్ణాటక భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే 40 శాతం కమిషన్ ఇవ్వాలని గుత్తేదారులు చెబుతున్నారని.. 30 శాతం కమిషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు అంటున్నారని మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారని జేపీ నడ్డాను నిలదీశారు. స్వయంగా నడ్డాపై వచ్చిన ఆరోపణలను కూడా ట్యాగ్ చేసిన కేటీఆర్.. రాజా హరిశ్చంద్రకు ఫస్ట్ కజిన్ అంటూ ఎద్దేవా చేశారు. రూ.7 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.50 రూపాయలు పెరగడాన్ని.. అచ్చేదిన్ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్
Last Updated : May 7, 2022, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details