ETV Bharat / state

తెరాస అంటే... తెలంగాణ రజాకార్‌ సమితి: జేపీ నడ్డా

author img

By

Published : May 5, 2022, 9:21 PM IST

Updated : May 5, 2022, 10:16 PM IST

JP Nadda Comments: మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన 'జనం గోస- భాజపా భరోసా' బహిరంగసభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై జేపీ నడ్డా తనదైన శైలీలో విమర్శలు చేశారు. ''తెరాస అంటే.. తెలంగాణ రాష్ట్ర సమతి కాదు.. తెలంగాణ రజాకార్‌ సమితి'' అని పేర్కొన్నారు.

jp nadda on trs
తెరాస అంటే... తెలంగాణ రజాకర్‌ సమితి: జేపీ నడ్డా

JP Nadda Comments: బండి సంజయ్‌ యాత్రకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన 'జనం గోస- భాజపా భరోసా' బహిరంగసభలో పాల్గొన్న జేపీ నడ్డా... తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉందన్నారు. భాజపా సర్కార్‌ చాలా బాధ్యతాయుతమైనదని స్పష్టం చేశారు. మోదీ సర్కార్‌ 130 కోట్ల మందికి ఉచిత కొవిడ్‌ టీకాలు ఇచ్చిందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ వల్లే ఇవాళ మాస్క్‌లు లేకుండా కూర్చోగలిగామన్నారు.

JP Nadda on Modi: పాశ్చాత్య దేశాలకు సాధ్యం కానిది మోదీ సర్కార్‌ చేసి చూపిందని జేపీ నడ్డా వెల్లడించారు. మోదీ సర్కార్‌ రెండేళ్ల పాటు ప్రజలకు ఉచితంగా రేషన్‌ అందజేసిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఉచితంగా ఇచ్చిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంపై దేశమంతా సంతోషంగా ఉందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంలో చేరేందుకు కేసీఆర్‌ మాత్రం నిరాకరించారని ఆరోపించారు.

JP Nadda on KCR: అవినీతిలో తెలంగాణ సర్కార్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని జేపీ నడ్డా అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ భ్రష్టు పట్టించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కొత్తగా ఒక్క ఇంచు భూమికీ నీరు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సి ఉందని అన్నారు.

''దుబ్బాక, హుజూరాబాద్​లో కేసీఆర్​ను ఓడించాం... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ షేక్ చేస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. కరోనాతో పెద్ద పెద్ద దేశాలు అల్లకాల్లోలం అయితే ప్రజల సహకారంతో ప్రధాని కరోనాను ఎదుర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ మూలంగా మాస్క్​లు లేకుండా కూర్చోగలిగాం. కొవిడ్ నియమ నిబంధనలను పాటించని కేసీఆర్.. కొవిడ్ నిబంధనల పేరుతో బండి సంజయ్​ని అరెస్ట్ చేయించారు. తెలంగాణలో భాజపాను గెలిపిస్తే ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తాం. కేసీఆర్ సర్కారు అత్యంత అవినీతి ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇంచు భూమికి కూడా నీరు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్​కు ఏటీఏం అయింది. తెరాస అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు... తెలంగాణ రజాకార్‌ సమితి.''

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

jp nadda on trs: మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు జేపీ నడ్డా. ''టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రజాకార్‌ సమితి'' అని విమర్శించారు. కేసీఆర్‌ 8 ఏళ్లల్లో ఎంతమందికి రెండుపడక గదులు ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్ల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూడా కేసీఆర్‌ వినియోగించుకోలేకపోయారన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వివరించారు.

తెరాస అంటే... తెలంగాణ రజాకార్‌ సమితి: జేపీ నడ్డా

ఇదీ చూడండి:

ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్లను అధికారంలోకి వచ్చాక తొలగిస్తాం: బండి

Last Updated : May 5, 2022, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.