తెలంగాణ

telangana

KTR: ఆ అధికారులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?: మంత్రి కేటీఆర్

By

Published : Nov 13, 2021, 4:03 PM IST

Updated : Nov 13, 2021, 4:36 PM IST

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రానికి పలు అవార్డులు (12 Swachh Bharat Mission awards for Telangana) రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో మీడియా (ktr press conference)తో ఆ వివరాలు వెల్లడించారు. కంటోన్మెంట్(hyderabad cantonment area) అధికారుల తీరును తప్పు పట్టారు. కంటోన్మెంట్(secunderabad cantonment area) అధికారులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అంటూ ప్రశ్నించారు.

(ktr about awards to telangana
(ktr about awards to telangana

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రం సత్తా చాటిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్(ktr about swachh survekshan awards) వెల్లడించారు. శానిటేషన్‌ ఛాలెంజ్‌లో దేశంలోని అన్ని పట్టణాల్లో జరిగిన పోటీల్లో రాష్ట్రానికి 12అవార్డులు వచ్చాయని(swachh survekshan awards to telangana) మంత్రి ప్రకటించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణకు పురస్కారం దక్కిందన్నారు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్‌లో తొలిసారి రాష్ట్రానికి అవార్డు వచ్చిందని మంత్రి తెలిపారు. టాప్‌ 3 పట్టణాల్లో కరీంనగర్‌కు అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈనెల 20న దిల్లీలో స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులు(swachh survekshan awards 2021) ప్రదానం చేయనున్నట్లు మాసబ్‌ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వివరించారు.

గార్భేజ్‌ ఫ్రీ సిటీ కింద గ్రేటర్ హైదరాబాద్‌ను గుర్తించారని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి(pattana pragathi news) కార్యక్రమానికి ఈ మొత్తం ఘనత దక్కుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అవార్డులు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని మంత్రి కొనియాడారు. అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటీ అధికారులకు అభినందనలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవంలో శాఖ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.

కొత్త చట్టం ద్వారా మున్సిపాలిటీలకు రూ.2,950 కోట్లు ఇచ్చాం. గార్బేజ్ ఫ్రీ సిటీ కింద గ్రేటర్ హైదరాబాద్‌ను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు వచ్చింది. 101 మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ ప్లస్‌ గుర్తింపు ఉంది. వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్‌ను ఇప్పటికే గుర్తించింది. అంతేకాకుండా నిజాంపేట్, ఇబ్రహీంపట్నం, సిరిసిల్ల, ఘట్​కేసర్, కోస్గి, హుస్నాబాద్, సిద్దిపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్​ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. వీధి వ్యాపారులకు రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. కంటోన్మెంట్‌ రోడ్లకు కేంద్రం నిధులు ఇవ్వటం లేదు. ఇష్టారీతిన రోడ్లు మూసివేస్తున్నారు. కంటోన్మెంట్‌ భూముల్లో రహదారులకు అంగీకరించడంలేదు. కంటోన్మెంట్‌ అధికారులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు.

-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

'రాష్ట్రం అభివృద్ధి పట్ల కేంద్రం నుంచి అవార్డులు, ప్రసంశలు వస్తున్నాయి కానీ పైసలు మాత్రం రావడం లేదని' మంత్రి(ktr comments on central government) ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుంటే రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కంటోన్మెంట్‌లో(secunderabad cantonment area) అభివృద్దికి కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని... హైదరాబాద్ అభివృద్ది విషయంలో కేంద్రం తమ విజ్ఞప్తులను పదుల సంఖ్యలో బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం

ఇదీ చదవండి:Minister Niranjan Reddy : నల్ల చట్టాలతో రైతులను వంచించే కేంద్రానికి.. ఆ శక్తి లేదా?

Last Updated : Nov 13, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details