తెలంగాణ

telangana

Gangula Talks With Ration Dealers : ఆ రెండు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: గంగుల

By

Published : May 22, 2023, 9:39 PM IST

Minister Gangula Talks With Ration Dealers Success : చౌక ధరల దుకాణాల డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్‌ చర్చలు సఫలమయ్యాయి. వారు మొత్తం 22 అంశాలు ప్రభుత్వం ముందు ఉంచగా.. 20 సమస్యల పరిష్కారినికి సానుకూలంగా మంత్రి స్పందించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ఈ రెండు సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Gangula Talks With Ration Dealers
Gangula Talks With Ration Dealers

Minister Gangula Talks With Ration Dealers Success : చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘాల సంఘం ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూన్‌ 5 నుంచి రేషన్‌ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్‌ అంబేడ్కర్ సచివాలయంలో రేషన్‌ డీలర్ల ఐకాస ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పద్మాదేవేందర్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌, ఐకాస ఛైర్మన్‌ నాయికోటి రాజు, ఉపాధ్యక్షుడు బంతుల రమేశ్​బాబు, కన్వీనర్‌ దుమ్మాటి రవీందర్‌, కో కన్వీనర్‌ గడ్డం మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీలర్ల సంఘం ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 22 అంశాలు ప్రభుత్వం ముందు ఉంచగా.. 20 సమస్యల పరిష్కారానికి మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించారు.

ఆ రెండు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా!: ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి వారికి హామీ ఇవ్వడంతో చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘాల ఐకాస మెత్తబడింది. సుధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ఈ రెండు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్​ హామీ ఇచ్చారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ఆ కర్తవ్యం ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్‌ డీలర్లపై కూడా అంతే ఉందని అభిప్రాయపడ్డారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దు.. ఈ బాధ్యత విస్మరించి రేషన్‌ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్‌ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరం అని మంత్రి ప్రస్తావించారు.

సీఎం కేసీఆర్​పై మాకు సంపూర్ణ నమ్మకం ఉంది?: మంత్రి సమక్షంలో జరిగిన సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ల డీలర్ల సంఘం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంపూర్ణ నమ్మకం ఉందని స్పష్టం చేసింది. సీఎం తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో సమ్మె విరమిస్తున్నామని.. సత్వరం మంత్రి గంగుల ఇచ్చిన హామీలపై కార్యాచరణ ప్రారంభించిన ఉత్తర్వులు జారీ చేయాలని రేషన్ డీలర్ల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details