తెలంగాణ

telangana

Harish Rao latest news : 'తెలంగాణ కాంగ్రెస్​.. పిచ్చోడి చేతిలో రాయిగా మారింది'

By

Published : Jul 16, 2023, 6:36 PM IST

Harishrao Fires On Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్​ పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఉచిత విద్యుత్​ అంశంపై ఎంత చర్చ జరిగితే.. బీఆర్​ఎస్​కు అంత లాభమని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్​ నేతలు బీఆర్​ఎస్​లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Harishrao
Harishrao

Sangareddy Congress leaders Joined in BRS Party : మంత్రి హరీశ్​రావు సమక్షంలో ఇవాళ జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్​ఎస్​లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీశ్​రావు.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ సంఘ నేతలు, బీఆర్​ఎస్​లోకి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందించామని పేర్కొన్నారు. పాత, కొత్త వారు కలిసి పని చేసి గులాబీ జెండా ఎగరేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా.. బీఆర్​ఎస్​ పాలనలో కరెంటు బాగుందా అని తెలంగాణ సమాజం ఆలోచించాలని పేర్కొన్నారు.

"కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్​ఎస్​కు అంత లాభం. జహీరాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం బంద్ అయింది. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. పాత, కొత్త నేతలు కలిసి పని చేసి గులాబీ జెండా ఎగురవేయాలి". - హరీశ్‌రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

'కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్​ఎస్​కు అంత లాభం'

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అద్భుతమైన పంటలు పండుతున్నాయన్నారు. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్​ఎస్​కు అంత లాభమని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఏపీలో పొన్నాల లక్ష్మయ్య విద్యుత్​ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే స్వంత గ్రామంలో మూడు గంటల కరెంటు రైతులకు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని విమర్శించారు.

'హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టుకు మొగ్గు చూపింది కాంగ్రెస్​ పార్టీ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీస్తున్నారు' అని మంత్రి మండిపడ్డారు. 2009లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు గుర్తు చేశారు.

Zaheerabad Congress leaders Joined in BRS : తెలంగాణ మోడల్ కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్​కు పోటీలేదని పేర్కొన్న ఆయన.. ఆయన ఎక్కడ పోటీ చేసినా ప్రజలు కళ్లకు అద్దుకొని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిపై రేవంత్ చేసిన​ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details