ETV Bharat / state

HarishRao Latest News : 'తెలంగాణతో కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. కానీ కాంగ్రెస్, బీజేపీది పేకమేడల బంధం'

author img

By

Published : Jul 10, 2023, 4:01 PM IST

Harishrao
Harishrao

Harishrao Comments on BJP : తెలంగాణతో కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని హరీశ్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంతో కాంగ్రెస్, బీజేపీది పేకమేడల బంధమని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4,000 పింఛన్‌ ఇచ్చిన హామీని ఇక్కడ కూడా ఇస్తామని ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. దక్షిణ భారత్‌పై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపుతోందిని హరీశ్​రావు ధ్వజమెత్తారు.

Harishrao Fires on Congress : సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్​రావు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన జహీరాబాద్‌లో.. గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాల ద్వారా గిరిజనులకు 10 ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు. గిరిజనులకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పదవుల కోసం రాజకీయం చేస్తున్నాయని హరీశ్​రావు దుయ్యబట్టారు.

అంతకుముందు హరీశ్​రావు సంగారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన నూతన సభ్యులను సన్మానించారు. సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.4427 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణతో కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

Harishrao on Opposition Parties : తెలంగాణతో కాంగ్రెస్, బీజేపీది పేకమేడల బంధమని హరీశ్​రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4,000 పింఛన్‌ ఇచ్చి.. ఇక్కడ హామీ ఇవ్వాలని ప్రశ్నించారు. రూ.25,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని పార్లమెంటులో చెప్పారని.. రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ దక్షిణ భారత్‌పై సవితి తల్లి ప్రేమ చూపుతోందని దుయ్యబట్టారు. బీఆర్​ఎస్​ హైకమాండ్ తెలంగాణ ప్రజలని.. బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్ దిల్లీలో ఉందని హరీశ్​రావు పేర్కొన్నారు.

"మార్కెట్ యార్డుల్లో సీఎం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. గిరిజనులకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించాం. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక చట్టం తీసుకువచ్చాం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించారు. గిరిజనులకు 95 గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. గిరిజనులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం." - హరీశ్​రావు, మంత్రి

HarishRao Latest News : అంతకు ముందు0 పటాన్‌చెరులో వివిధ అభివృద్ధి పనులను హరీశ్​రావు ప్రారంభించారు. డీసీసీబీ బ్యాంకు కార్యాలయం, ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాలు, ఫ్రీడం పార్కు, గ్రేటర్‌ డివిజన్‌ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. కాలం చెల్లిన నాయకులకు పట్టం కట్టినా బీఆర్ఎస్ విజయం తప్పదని హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా భారత్​ రాష్ట్ర సమితి హ్యాట్రిక్‌ విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని హరీశ్​రావు ధ్వజమెత్తారు.

Harishrao Comments on BJP : దక్షిణ భారత్‌పై బీజేపీకి చిన్నచూపు ఎందుకో అర్థం కావడం లేదని హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. ఐటీ సేవల విస్తరణకు పటాన్‌చెరు కేంద్రం కాబోతోందని పేర్కొన్నారు. మళ్లీ గెలిచిన తర్వాత పటాన్‌చెరు దాకా మెట్రో తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు హరీశ్‌రావు వెల్లడించారు.

బీజేపీ కాంగ్రెస్ హైకమాండ్ దిల్లీలో ఉంది

ఇవీ చదవండి: Harish Rao on Telangana MBBS seats : 'వైద్యసీట్ల పెంపులో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది'

Harish Rao Latest News : 'బీఆర్​ఎస్​వి న్యూట్రిషన్‌.. విపక్షాలవి పార్టిషన్‌ పాలిటిక్స్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.