ETV Bharat / state

లారీ డీజిల్​ ట్యాంకులో చెలరేగిన మంటలు- పెట్రోల్​ బంకులో తప్పిన ప్రమాదం - Lorry catches fire at petrol Bunk

author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 8:19 PM IST

Lorry catches Fire At petrol Bunk : పెట్రోల్​ బంకులో ఇంధనం నింపడానికి వచ్చిన లారీ ట్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ​బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ ప్రమాదం తప్పినందుకు అక్కడ ఉన్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Lorry catches Fire At petrol Bunk
Lorry catches Fire At petrol Bunk (ETV Bharat)

లారీ డీజిల్​ ట్యాంకులో చెలరేగిన మంటలు- పెట్రోల్​ బంకులో తప్పిన ప్రమాదం (ETV Bharat)

Lorry catches Fire At petrol Bunk : డీజిల్ కోసమని పెట్రోల్​ బంక్​కు వచ్చిన లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్​ నింపడానికి సిద్ధమవుతున్న సమయంలో లారీ ట్యాంక్​ నుంచి మంటలు వచ్చాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేంతలోపే లారీ ఇంజిన్​ నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభించాయి. ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా పెట్రోల్​బంకు సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే తేరుకుని చాకచక్యంగా వ్యవహరించి అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరి పట్టణంలో జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ప్రమాద వివరాలిలా : పెట్రోల్​ బంకు సిబ్బంది వివరాల ప్రకారం భువనగిరి పట్టణంలోని రిలయన్స్​ పెట్రోల్​ బంకు వద్దకు డీజిల్​ ఫిల్ చేయించడానికని ఓ లారీ వచ్చింది. అయితే వచ్చిన కాసేపట్లోనే లారీ అయిల్​ ట్యాంక్​ నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పెట్రోల్​ బంకు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమీపంలో ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాల ద్వారా మంటలను ఆర్పివేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఊహించని పరిణమానికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంటలు చల్లార్చడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించిన భారీ ప్రమాదం జరిగి ఉండేది.

నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు - డ్రైవర్​ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం - Car Fire Accident In Zaheerabad

Fire Accident at Petrol Bunk : ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెట్రోల్​ బంకులో ఇంధనం ఫిల్​ చేయడానికి లారీలో మంటలు చెలరేగాయి. పెట్రోల్​ బంకు సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పినందుకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద వివరాలిలా. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఒద్యారంలోని పెట్రోల్​ బంక్​కు డీజిల్​ ఫిల్​ చేసుకోవడానికి టిప్పర్ వచ్చింది. డీజిల్​ నింపడానికి సిద్ధమవుతున్న సమయంలో టిప్పర్​ ఇంజిన్​ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అగ్నిమాపక పరికరాలతో ఆర్పివేశారు. ఈ మధ్య తరచూ ఏదో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతుండగం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. వేసవి కాలం నేపథ్యంలో మంటలు వేగంగా అంటుకుంటున్నాయి. అగ్నిమాపక అధికారులు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం చర్చనీయాంశమైంది.

టిప్పర్​ ఇంజిన్​లో మంటలు - పెట్రోల్​బంకులో తప్పిన పెను ప్రమాదం

చెట్టును ఢీకొన్న కారు - మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి - Car Fire Accident In Khammam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.