Kajipet Wagon Factory : కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఎలా ఉంటుందంటే..

By

Published : Jul 8, 2023, 2:48 PM IST

thumbnail

PM Modi Warangal tour : ఓరుగల్లులో పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాజీపేట వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని అయోధ్యాపురంలో 160 ఎకరాల్లో ఈ పరిశ్రమకు ఇవాళ ప్రధాని మోదీ భూమి పూజ చేస్తారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.... కోచ్ పరిశ్రమ కోసం....ఆందోళనలు జరిగినా.... కోచ్ ఫ్యాక్టరీ స్ధానంలో.... వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకే కేంద్రం మొగ్గు చూపి....ఆ మేరకు వడివడిగా శంకుస్ధాపనకు శ్రీకారం చుట్టింది. వ్యాగన్ తయారీ నిర్మాణ బాధ్యతలను రైల్వే నిగమ్ లిమిటెడ్​కు అప్పగించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 24 నెలల్లో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తారు. ప్రస్తుత  వ్యయం 521 కోట్లైనా.... నిర్మాణం పూర్తయ్యే వరకూ..... అది మరింత పెరగవచ్చని అంచనా. దేశంలో సరుకు రవాణా పెరుగుతుండటంతో వ్యాగన్ల అవసరం చాలా ఉంది.  దేశంలో 22,790 మెట్రిక్ టన్నుల సరకు రవాణాకు మాత్రమే వ్యాగన్లు ఉన్నాయి. మరో 7000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణాకు ఇవి చాలా అవసరం. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో వ్యాగన్ల కొరత తీరుతుంది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.