తెలంగాణ

telangana

ప్రజాభవన్ కారు ఘటన - మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎలా తప్పించారంటే?

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 10:11 AM IST

EX MLA Shakeel Son Accident Case Update : మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్​ హైదరాబాద్​లోని ప్రజాభవన్​ వద్ద కారుతో బారికేడ్లను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుని తప్పించేందుకు సహకరించినందుకే ఇన్​స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అసలు నిందితుడిని ఎలా తప్పించారో పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఇంతకీ ఏమైందంటే?

EX MLA Shakeel Son Escape
EX MLA Shakeel Son Accident Case Update

EX MLA Shakeel Son Accident Case Update : హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్ వద్ద ఈనెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రజాభవన్ బారికేడ్లు ధ్వంసం చేసిన ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. సాహిల్ కారును అతివేగంగా నడిపి బారికేడ్లను ఢీకొట్టాడు. సాధారణంగా ఇటువంటి ప్రమాదాల్లో కారు నడిపిన వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష(Sahil Drunk and Drive Test Report) నిర్వహిస్తారు. అనంతరం కేసు నమోదు చేస్తారు. వాహనం స్వాధీనం చేసుకొని నిందితులకు నోటీసులు జారీ చేస్తారు.

పంజాగుట్టలో అగ్నిప్రమాదం - ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం : ఈ కేసు విషయంలో పంజాగుట్ట పోలీసులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్​స్పెక్టర్​ దుర్గారావు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు సాహిల్​ను కారులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చారు. అనంతరం కానిస్టేబుల్​కు అతడిని అప్పగించి పక్కనే ఉన్నట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​లో బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు పంపించారు. అక్కడ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకొని అప్పటికే బయట సిద్ధంగా ఉన్న తన కారులో బంజారాహిల్స్​లోని తన ఇంటికి వెళ్లాడు.

ప్రజాభవన్ ముందు జరిగిన కారు ప్రమాదంలో నిందుతుణ్ని తప్పిస్తున్నారా - పోలీసుల పాత్రపై అధికారులు అనుమానం

Inspector Create Story in EX MLA Shakeel Son Case : సాహిల్ వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్న వ్యక్తిని తన స్థానంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్​కు పంపించాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు పురిగొల్పాడు. అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా వెలుగు చూశాక కూడా ఇన్​స్పెక్టర్​ తమకు అసలు విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచారని అంతర్గత విచారణలో నిర్దారించినట్లు తెలిపారు. అసలు నిందితుడు దర్జాగా తప్పించుకొని దుబాయ్ పారిపోయేందుకు ఇన్​స్పెక్టర్ పరోక్షంగా సహకరించారని అంచనాకు వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్​చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు

Inspector Suspend in EX MLA Shakeel Son Case: పోలీసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా నడిపిన కథలో ఇన్​స్పెక్టర్​ కీలకంగా వ్యవహరించారని, పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారాలను(Evidence of CCTV Footage in Sahil Accident Case) పోలీస్​ అధికారులు సేకరించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించిన తరువాతే ఇన్​స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడని పట్టుకుని వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా, అసలు విషయం బయట పడుతుందని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బస్సు ఎక్కే క్రమంలో కింద పడిపోయి రెండు కాళ్లు కోల్పోయిన పాఠశాల విద్యార్థి

ABOUT THE AUTHOR

...view details