తెలంగాణ

telangana

'ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం'

By

Published : Feb 5, 2021, 1:39 PM IST

Updated : Feb 5, 2021, 8:51 PM IST

eamcet exam will conduct after june in 2021
'ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం'

13:37 February 05

'ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం'

జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ సిలబస్ పై ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పాపిరెడ్డి, చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్, జేఎన్ టీయూహెచ్ అధికారులు హాజరయ్యారు. ఎంసెట్ సిలబస్​పై ఈ ఏడాది అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు.

ఎంసెట్​లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం.. మొదటి సంవత్సరంలో పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. జేఈఈ తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్​లో ఛాయిస్ ఇవ్వనున్నారు. ఎన్ని ప్రశ్నలు అదనంగా ఇవ్వాలో నిపుణులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని, మార్పు లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. 

ఇదీ చదవండి:పవర్ ప్లాంట్​ ప్రమాదంలో కూలీ మృతి.. బాధిత కుటుంబం ఆందోళన

Last Updated : Feb 5, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details