తెలంగాణ

telangana

Shalu chourasiya case news: 'పాత నేరస్థుడే షాలూ చౌరసియాపై దాడి చేశాడు'

By

Published : Nov 20, 2021, 1:26 PM IST

Updated : Nov 20, 2021, 5:53 PM IST

కేబీఆర్ పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి కేసును(Shalu chourasiya case) పోలీసులు ఛేదించారు. నిందితుడు బాబు గదిలో చౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితుడు బాబుకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

Shalu chourasiya case, CP anjani kumar
షాలు చౌరాసియా కేసు, సీపీ అంజనీ కుమార్

కేబీఆర్ పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి కేసును(Shalu chourasiya case news) పోలీసులు చేధించారు. ఈ నెల 14న చౌరాసియాపై లైంగిక దాడి చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్న కొమ్ము బాబు.. దోపిడీకి ప్రయత్నించి.. అసభ్యంగా ప్రవర్తించాడని అంజనీ కుమార్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన బాబు.... మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. సినిమా సెట్స్‌లో సహాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో పనులు లేక సొంతూరుకు వెళ్లిన బాబు ఆర్నెళ్ల క్రితం నగరానికి వచ్చి రోజువారి కూలిపని చేస్తున్నాడు. డబ్బులు సరిపోకపోవడతంతో దోపిడీలు చేయడం మొదలుపెట్టాడని సీపీ తెలిపారు. బాబుకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

నేర చరిత్ర ఉందా?

2019 డిసెంబర్‌లో గోల్కొండ పీఎస్ పరిధిలో చరవాణి చోరీ కేసులో బాబు జైలుకు వెళ్లొచ్చాడని వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలోనూ కేబీఆర్ పార్కులో ఓ మహిళ చరవాణి లాక్కునేందుకు ప్రయత్నించగా... ప్రతిఘటించి అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకుంది. నటి చౌరాసియాపై దాడి ఘటనలోనూ నిందితుడు ఆమె చరవాణి లాక్కొని ఇందిరానగర్ సమీపంలో స్విచాఫ్ చేశాడు. పోలీసులు యూసూఫ్ గూడ, కృష్ణానగర్, బంజారాహిల్స్ కు చెందిన దాదాపు 80మంది పాతనేరస్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి నిందితుడు బాబును అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

షాలూ చౌరాసియా కేసుపై సీపీ అంజనీకుమార్

ఏం జరిగింది?

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద దుండగుడు నటి షాలూ చౌరాసియాపై దాడి (Attack on Shalu Chourasiya) చేసి పారిపోయాడు. ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలించారు. నటిపై దాడి (Attack on Shalu Chourasiya) చేసిన తర్వాత నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా అతని కదలికలను గమనించారు. నటికి పరిచయస్తులే దాడి (Attack on Shalu Chourasiya) కి పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై పలు పీఎస్​ల్లో కేసులు

నిందితుడు యూసఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. సినీ పరిశ్రమలో బాబు లైట్​ బాయ్​గా పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నటిపై దాడి (Attack on Shalu Chourasiya) చేసిన అనంతరం.. నిందితుడు కృష్ణానగర్​లోని నివాసానికి వెళ్లి.. ఫోన్​ను గదిలో ఉంచాడు. ఎట్టకేలకు బాబును అరెస్ట్ చేసిన పోలీసులు... గదిలో చౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనూ మూడు కేసులు ఉన్నట్లు పోలీసుల పేర్కొన్నారు. విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌ల్లో అతనిపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గోల్కొండ పీఎస్‌లో నమోదైన కేసులో జైలుకు వెళ్లొచ్చిన బాబు.. నటిపై దాడి (Attack on Shalu Chourasiya) చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Attack on Actress: ఆ సినీనటిపై పరిచయస్తులే దాడి చేశారా?

Last Updated :Nov 20, 2021, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details