ETV Bharat / state

'అమ్మ స్ఫూర్తితో ఆడేస్తున్నా - టేబుల్‌ టెన్నిస్‌లో నా పేరు చిరస్థాయిగా నిలవాలి' - MANIKA BATRA SUCCESS STORY

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 4:43 PM IST

Table Tennis Player Manika Success Story : ఆరడుగుల ఎత్తు, చూపు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం! అవే ఆమెకు మోడలింగ్‌ వైపు బోలెడన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి. కానీ, తను మాత్రం టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రేమలో పడింది. అందులోనే తన ప్రత్యేకతను నిరూపించుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే పట్టువీడని సాధనతో సాధించింది. బరిలోకి దిగి ప్రత్యర్థులను కట్టడి చేయడంలో తనకెవరూ సాటి రారని నిరూపించింది. ఇటీవల మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచస్థాయిలో 24వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఆమే మనికా బత్రా. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణి.

First Indian TT player Manika Batra
Table Tennis Player Manika Successful Story (eenadu.net)

First Indian TT player Manika Batra Success Story : ఒత్తిడిలోనూ శరవేగంగా స్పందించగల చురుకుదనం. బాల్‌ని ప్రతికూల స్థితిలోనూ నియంత్రించగల సత్తా మనికాను భారత టేబుల్‌ టెన్నిస్‌ క్వీన్‌గా మార్చేశాయి. అంతేనా, లాంగ్‌ పింపుల్డ్‌ రబ్బర్‌ రాకెట్‌ని వాడి ఆడే తక్కువ మంది క్రీడాకారిణుల్లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపునూ తీసుకొచ్చాయి. మనికా స్వరాష్ట్రం దిల్లీ. గిరీష్‌-సుష్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో చిన్నది మనికా బత్రా.

అక్క ఆంచల్, అన్నయ్య సాహిల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతుంటే తానూ ఆటపై మక్కువను పెంచుకుంది. అలా నాలుగేళ్ల ప్రాయం నుంచే టీటీ ఆడటం ఆరంభించింది. మెల్లగా స్కూలు నుంచి స్టేట్​ లెవల్​ టోర్నమెంట్లలో రాణించే వరకూ చేరుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తనకి మరింత మెరుగైన ట్రైనింగ్​ ఇప్పించడానికి కోచ్‌ సందీప్‌ గుప్తాకి చెందిన హన్స్‌రాజ్‌ మోడల్‌ స్కూల్‌లో చేర్చారు. అది మొదలు మనికా ఇక వెనుదిరిగి చూడలేదు.

టేబుల్‌ టెన్నిస్‌లో నా పేరు చిరస్థాయిగా నిలవాలి : తనకు తెలియకుండానే టీటీపై ఇష్టం మొదలైందని అంటోంది ఆమె. అదెంతగా అంటే, బ్యాడ్మింటన్‌కు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఎంతటి పేరు తెచ్చారో టేబుల్‌ టెన్నిస్‌లో తన పేరూ అదే స్థాయిలో వినిపించాలనుకున్నానని చెప్పుకొస్తుంది. అందుకోసమే పలు పెద్ద సంస్థల్లో మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చినా కాదనుకున్నా’ అంటుందీమె. చివరికి ఆటకోసం గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాదిలోనే చదువుకీ దూరమైంది.

చిలీ ఓపెన్‌లో తొలి విజయం అందుకున్నప్పటి నుంచి ఆసియా క్రీడల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వరకూ మనికా ప్రయాణంలో ఎన్నో మలుపులు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్, సమ్మర్‌ ఒలింపిక్స్‌ వంటివాటిల్లో గోల్డ్​, సిల్వర్​, కాంస్య పతకాలెన్నో అందుకుంది. ఈ మధ్యే సౌదీ స్మాష్‌ టోర్నమెంట్‌లో సంచలన విజయాలు రికార్డ్ చేసుకుంది.

టెబుల్ టెన్నిస్​లో మనిక బాత్రా సంచలనం- తొలి మహిళా ప్లేయర్​గా రికార్డ్ - Table Tennis Rankings

First Indian Woman TT Player : తాజాగా సింగిల్స్‌ ర్యాంకింగ్‌లో ప్రపంచంలో 24వ స్థానానికి ఎగబాకిన తొలి భారతీయ మహిళా టీటీ ప్లేయర్‌గా ఘనత సాధించింది. అలాగని తనకి అపజయాలే ఎదురుకాలేదనుకోవద్దు. ‘ఆటలో గెలుపోటములు సహజం. ఈ ఏడాది సౌదీ స్మాష్‌లో ప్రెజెంట్​ వరల్డ్‌ నంబర్‌ 2 అయిన వాంగ్‌మన్యుని ఓడించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కానీ, దాన్ని వేడుకగా జరుపుకోవాలనుకోలేదు.

ఎందుకంటే తరవాత రౌండ్లలో నేను ఆడాల్సిన ఆట ఎంతో ఉంది. వరల్డ్​ ఛాంపియన్‌షిప్‌ అయినా ఒలింపిక్స్‌ అయినా నాకు ఒకటే. క్రీడను ఆస్వాదించాలి. విజయాన్ని శాసించే ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకోసం మెడిటేషన్​, వర్కవుట్లు, క్రీడాసాధన చేస్తా. అవే నన్ను నేను మరింతగా మెరుగుపరుచుకునేందుకు సాయం చేస్తాయి‘ అని చెబుతోంది మనికా బాత్రా.

అమ్మ స్ఫూర్తితో ఆడేస్తున్నా : టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా తనకో ఐడెంటిటీ రావడానికి తల్లి సుష్మ త్యాగమే కారణం అంటోందీమె. ‘నాన్న మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో అమ్మే ఇంటి బాధ్యతను చూసుకుంటుంది. నేను ఆటకోసం ఎక్కడికి వెళ్లినా, ఎంత దూరం ప్రయాణం చేసినా లెక్క చేయకుండా నాతో పాటు వేల మైళ్లు ప్రయాణిస్తుంది. నాపై ఒత్తిడి తగ్గించేందుకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నేను అన్నింటా గొప్పగా ఉండేలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తోంది.

ముఖ్యంగా స్టడీ, ఆటల మధ్య సమతుల్యం సాధించడానికి ఆవిడ చేసిన కృషి ఎంతో. ఆఖరికి నేను కాలేజీ మానేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడూ, అమ్మనే నాకు తోడుగా ఉంది. ఇలా చెప్పుకొంటూ పోతే అమ్మ నా కోసం చేసిన త్యాగాలకు కొదువ లేదు. ఆమె కష్టానికి విలువా కట్టలేను కానీ, ఆవిడను హ్యాపీగా ఉంచేందుకూ ఆటలో విజయాలు అందుకునేందుకూ నిరంతరం శ్రమిస్తానని అంటోంది మనికా.

National Flag on Nails at Olympics Time : 2016 ఒలింపిక్స్‌ సందర్భంగా జాతీయ పతాకాన్ని నెయిల్‌ ఆర్ట్‌లా వేసుకుని ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన మనికా ఆటతోనే కాదు, తన అందం, ఫ్యాషన్‌ స్టైలింగ్‌తోనూ ఆకట్టుకుంటోంది. టీటీ ఆడేటప్పుడు ఎంత సీరియస్‌గా ఉన్నా, బాహ్య ప్రపంచంలో మాత్రం తానెంతో సరదాగా ఉంటానని చెబుతోంది.

మోడలింగ్‌పై ఇంట్రెస్ట్​ ఉన్నా ఆటే తనకు ముఖ్యం అంటోంది. అయినా ఆసక్తితో తరచూ ఫొటోషూట్‌ల్లో పాల్గొంటుందట. అలానే మనికా ప్రముఖ క్రీడా దుస్తుల తయారీ కంపెనీ అడిడాస్‌తో కలిసి ‘ఇంపాజిబుల్‌ ఈజ్‌ నథింగ్‌’ క్యాంపెయిన్‌ చేస్తోంది. తమ కలలను సాకారం చేసుకోవాలనే మహిళలను ప్రోత్సాహకరంగా సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఇది సాగుతోంది.

మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం

Manika Batra News: మనిక ఆరోపణలపై విచారణకు హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.