ETV Bharat / sports

టెబుల్ టెన్నిస్​లో మనిక బాత్రా సంచలనం- తొలి మహిళా ప్లేయర్​గా రికార్డ్ - Table Tennis Rankings

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 8:39 PM IST

Manika Batra Tennis: భారత టేబుల్ టెన్నిస్‌ యువ ప్లేయర్‌ మనిక బాత్రా సంచలనం సృష్టించింది. సింగిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్న మొదటి మహిళగా రికార్డు అందుకుంది.

Manika Batra Tennis
Manika Batra Tennis (Source: Getty Images)

Manika Batra Tennis: ఇండియా టేబుల్ టెన్నిస్ ఐకాన్ మనిక బాత్రా తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును క్రియేట్‌ చేసింది. మంగళవారం విడుదలైన టేబుల్ టెన్నిస్ (ITTF World Table Tennis Championships) ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌ 24కి చేరుకుంది. అంతకు ముందున్న 39వ స్థానం నుంచి ఏకంగా 15 స్థానాలు మెరుగుపర్చుచుకుంది. శ్రీజ అకులని అధిగమించి మరోసారి భారతదేశపు టాప్‌ ర్యాంక్డ్‌ ప్లేయర్‌గా స్టేటస్‌ పొందింది. అంతే కాదు 25 ఏళ్ల వయస్సులో, టాప్ 25 సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. 2019లో 24వ ర్యాంక్‌ అందుకుని సత్యన్ జ్ఞానశేఖరన్ రికార్డు సృష్టించాడు. భారతీయుడు సాధించిన అత్యత్తమ సింగిల్స్ ర్యాంక్‌ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు ఇదే ఫీట్‌ని మనిక బాత్రా రిపీట్‌ చేసింది.

స్మాష్ టోర్నమెంట్‌లో అదరహో: గతవారం సౌదీ అరేబియా స్మాష్ టోర్నమెంట్‌లో మనిక, అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనతోనే ఆమె మెరుగైన ర్యాంక్‌ అందుకుంది. టోర్నీలో ప్రపంచ నం.2, చైనాకు చెందిన ఒలింపిక్ పతక విజేత వాంగ్ మాన్యును మనిక ఓడించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించడానికి ప్రపంచవ్యాప్తంగా 14వ ర్యాంక్‌లో ఉన్న నినా మిట్టెల్‌హామ్‌ను ఓడించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన హీనా హయాటాతో పోటీపడి ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌
పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో, ఆచంట శరత్ కమల్, సీజన్‌డ్ క్యాంపెయినర్, మూడు స్థానాలు కోల్పోయాడు. అయితే 40వ ర్యాంక్‌లో అత్యధిక ర్యాంక్‌లో ఉన్న భారతీయుడిగా తన హోదాను నిలబెట్టుకున్నాడు. అదే సమయంలో, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్ వరుసగా 62, 63వ స్థానాల్లో నిలిచారు.

డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌
మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీ, ఐహికా ముఖర్జీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకున్నారు. అయితే థక్కర్, మనుష్ షా పురుషుల డబుల్స్ విభాగంలో మూడు స్థానాలు కోల్పోయి 15వ స్థానంలో నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మనిక, సత్యన్‌ జోడీ ఒక స్థానం తగ్గి, 24వ ర్యాంకు పొందారు.

60ఏళ్ల తర్వాత తొలిసారి - పాకిస్థాన్​పై భారత్ విజయం

టెన్నిస్​ హిస్టరీలో బోపన్న రికార్డు - 43 ఏళ్ల వయసులో నంబర్​ వన్ ప్లేయర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.