తెలంగాణ

telangana

TELANGANA GATE WAY: కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్కు

By

Published : Feb 13, 2022, 3:32 AM IST

Kandlakoya IT Park: మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో తెలంగాణ గేట్‌వే పేరిట భారీ ఐటీ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజైన ఈ నెల 17న మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Kandlakoya IT Park
Kandlakoya IT Park

Telangana Gateway at Kandlakoya: రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్‌ వే పేరిట 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజైన 17న దీనికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా దీనిని అవుటర్‌ రింగ్‌రోడ్డు వద్ద చేపడుతున్నారు. అత్యంత ఎత్తైన కొత్త ఐటీ పార్కు ఏర్పాటు కోసం గత కొన్నేళ్లుగా స్థలాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం కండ్లకోయ వైపు మొగ్గు చూసింది. విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలంగా భావించింది.

కండ్లకోయ జంక్షన్‌ వద్ద స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు సిద్ధం చేసింది. బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

ఐటీ పార్కు ప్రత్యేకతలు..

  • అంతస్తుల: 14 (రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎత్తైంది)
  • ఎత్తు: 40 మీటర్లు
  • కార్యాలయ స్థలం: అయిదు లక్షల చదరపు అడుగులు

ఇదీ చూడండి:దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డు.. రెండింటిలోనూ 100 మిలియన్​ మార్క్

ABOUT THE AUTHOR

...view details