ETV Bharat / state

దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డు.. రెండింటిలోనూ 100 మిలియన్​ మార్క్

author img

By

Published : Feb 12, 2022, 9:21 PM IST

South Central Railway Another Record: దక్షిణ మధ్య రైల్వే కొవిడ్‌-19 మహమ్మారితో ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో మైలు రాయిని అధిగమించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు జోన్‌ సరుకు రవాణా రంగంలో, ప్రజారవాణాలోనూ 100 మిలియన్‌ మార్క్​ను దక్షిణ మధ్య రైల్వే అధిగమించింది. ఇప్పటి వరకు జోన్ పరిధిలో 100 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేయగా.. సరుకు రవాణాలో 100 మిలియన్‌ టన్నులను దాటేసింది.

దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డు.. 100 మిలియన్​ మార్క్​ను దాటేసింది..
దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డు.. 100 మిలియన్​ మార్క్​ను దాటేసింది..

South Central Railway Another Record: దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును నెలకొల్పింది. సరుకు రవాణాలో 100 మిలియన్ టన్నులను అధిగమించడంతో పాటు, 100 మిలియన్ల ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి సరుకు రవాణా(లోడింగ్​,అన్​లోడింగ్)లో కొవిడ్‌ ముందు కాలంలో ఉన్న స్థాయిని అధిగమించింది. జోన్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా లోడింగ్‌ జరిగింది. ఇందులో మెసర్స్‌, సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌, వెస్టర్స్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లాంటి వినియోగదారుల నుంచి 48 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌తో ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి.

పూర్వస్థితికి సరుకు రవాణా..

వీటికి అదనంగా 28.32 ఎమ్‌టీలు సిమెంట్‌, 3.67 ఎమ్‌టీల స్టీల్‌ ప్లాంట్ల ముడి సరకు, 1.85 ఎమ్‌టీలు కంటైనర్ల లోడింగ్​లతో జోన్ ముందుండడంలో దోహదపడ్డాయి. 7.16 ఎమ్‌టీల ఆహార ధాన్యాలు, 5.47 ఎమ్‌టీల ఎరువులు, 5.47 ఎమ్‌టీల ఇతర సరుకులు గత సంవత్సరం లాగే లోడింగ్‌ అయ్యాయని ద.మ.రైల్వే పేర్కొంది. కొవిడ్‌ ముందు సమయంతో పోలిస్తే అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దశలవారిగా రైలు సర్వీసులను తిరిగి పునరుద్దరించామని.. తద్వారా జోన్‌లో అనేక ప్రయాణికుల రైలు సర్వీసులు, సరుకు రవాణా కొవిడ్‌ పూర్వ స్థితికి చేరుకున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది.

అన్ని రకాల చర్యల వల్లే..

జోన్‌ పరిధిలో రిజర్వుడ్‌ సెగ్మెంట్లలో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పున:ప్రారంభించగా, అన్‌రిజర్వుడ్‌ సెగ్మెంట్లలో డిమాండ్‌ను బట్టి ప్యాసింజర్‌ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఇటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్లనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోన్‌లో 100 మిలియన్‌ మంది ప్రయాణికుల ప్రయాణం సాధ్యమైందని అధికారులు వివరించారు. ఇందులో 60శాతం ప్రయాణం ట్రాఫిక్‌ రిజర్వుడ్‌ సెగ్మెంట్‌ నుంచి రాగా, మిగిలిన 40శాతం అన్‌ రిజర్వుడ్‌ సెగ్మెంట్‌ నుంచి వచ్చిందన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.