తెలంగాణ

telangana

గాంధీలో పరిస్థితి దయనీయంగా ఉంది: అంజన్​ కుమార్ యాదవ్

By

Published : Jun 6, 2020, 3:43 PM IST

పక్క రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు లక్షల్లో చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ అంజన్​కుమార్ యాదవ్ ఆరోపించారు. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఉన్న వారికి కనీసం మందులు కూడా సరఫరా చేయడం లేదన్నారు.

Congress ex mp anjan kumar yadav on corona tests in state
గాంధీలో పరిస్థితి దయనీయంగా ఉంది: అంజన్​కుమార్ యాదవ్

గాంధీలో పరిస్థితి దయనీయంగా ఉంది: అంజన్​కుమార్ యాదవ్

హైదరాబాద్​లో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పరీక్షలు చేస్తుంటే ఇక్కడ మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. వలస కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అనిల్ యాదవ్, పార్టీ నాంపల్లి ఇంఛార్జీ ఫిరోజ్‌ఖాన్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​... కార్మికులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేసి వదిలేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నాంపల్లి ఇంఛార్జ్ ఫిరోజ్ ఖాన్. కనీసం మందులు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వముందన్నారు.

" పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి.. లక్షల్లో కరోనా వైరస్​ పరీక్షలు నిర్వహిస్తుంటే.. సీఎం కేసీఆర్​ మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోవడం లేదు"

- అంజన్​కుమార్ యాదవ్, మాజీ ఎంపీ

ఇవీ చూడండి: ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు: గుత్తా

ABOUT THE AUTHOR

...view details