తెలంగాణ

telangana

CM KCR Wishes to National Awards Winners : నేషనల్ ఫిల్మ్​​ అవార్డ్స్​ విన్నర్స్​కి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 6:18 PM IST

CM KCR Wishes to National Awards Winners : 69వ జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ వ్యక్తులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు. 69 ఏళ్ల తరువాత రికార్డును సృష్టించిన అల్లు అర్జున్​ని అభినందించారు. ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు కృషి కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

CM KCR Special Wish to Allu Arjun
KCR Wishes to National Awards Winners

CM KCR Wishes to National Awards Winners: తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విలక్షణమైన రీతిలో అత్యుత్తమ నటన ద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించకున్న సినీ హీరో అల్లు అర్జున్‌కు కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అల్లు అర్జున్ నటనా ప్రతిభతో మొట్ట మొదటి జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలన చిత్ర నటుడు కావడం.. తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడుగా.. విలక్షణ నటులైన చిరంజీవి స్పూర్తితో నేటితరం నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని అన్నారు. అదే సందర్భంలో.. తన సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్​కు, ఉత్తమ సినీ సాహిత్యానికి జాతీయ అవార్డు దక్కడంతో కేసీఆర్ హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

KCR Wishes to Allu Arjun: ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా భారతీయ సినిమాలతో పోటీపడుతోందని పేర్కొన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధి కోసం ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సీఎం ఆకాంక్షించారు.

National Awards Reactions : పుష్ప టీమ్ ఎమోషనల్.. 'నేషనల్'​ విన్నర్స్​కు సెలబ్రిటీల స్పెషల్​ విషెస్​

Telugu Movies won National Awards : తెలుగు చిత్ర పరిశ్రమకి మొత్తం 11 జాతీయ అవార్డులు దక్కాయి. అందులో ఆరు ఆర్​ఆర్​ఆర్​కి, రెండు పుష్ప మూవీలు కైవసం చేసుకున్నాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన మూవీ అవార్డు దక్కించుకుంది. ఉత్తమ నటీమణులుగా ఆలియాభట్​(Gangubai), కృతిసనన్​(Mimi) దక్కించుకున్నారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్​ఆర్​ఆర్​, ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​కి లభించింది. ఉత్తమ సాహిత్యం కేటగిరిలో కొండపొలం సినిమాకి రచించిన చంద్రబోస్​కి దక్కింది. ఈ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరికి ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదటి సారిగా తెలుగు హిరో అల్లు అర్జున్​కి జాతీయ నటుడుగా వచ్చినందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్​ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తగ్గదేలే అంటూ వారి సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసుకుంటున్నారు.

Kashmir Files National Awards : 'వారి వల్లే మా సినిమాకు అవార్డులు.. ఎవరికీ భయపడేదే లేదు'

National Film Awards 2021 List : జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ.. నేషనల్​ అవార్డ్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

'హార్ట్ బ్రేక్' అంటూ ఇన్​స్టాలో నాని పోస్ట్​.. ఆ సినిమాకు నేషనల్ అవార్డు రానందుకు ఫీలయ్యాడా!

ABOUT THE AUTHOR

...view details