ETV Bharat / entertainment

Ilayaraja Devi Sri Prasad : 'ఆయనే నా స్ఫూర్తి.. అందుకే ఈ జాతీయ అవార్డును అందుకోగలిగాను'

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 2:04 PM IST

Updated : Aug 26, 2023, 2:33 PM IST

Ilayaraja Devi Sri Prasad : టాలీవుడ్ స్టార్​ డైరెక్టర్​, నేషనల్​ అవార్డ్​ విన్నర్​ దేవీశ్రీ ప్రసాద్​ మ్యూజిక్​ మాస్ట్రో ఇళయరాజాను కలిశారు. 'పుష్ప' సినిమాకుగాను జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన్ను కలిసి కాసేపు ముచ్చటించారు.

Ilayaraja Devi Sri Prasad
Ilayaraja Devi Sri Prasad

Ilayaraja Devi Sri Prasad : టాలీవుడ్ స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​, నేషనల్​ అవార్డ్​​ దేవీశ్రీ ప్రసాద్​ ఇటీవలే మ్యూజిక్​ మాస్ట్రో ఇళయరాజాను కలిశారు. 'పుష్ప' సినిమాకుగాను జాతీయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఇళయరాజా నివాసానికి వెళ్లిన డీఎస్పీ.. ఆయన్ను కలిసి పాదాభివందనిం చేశారు. ఆ తర్వాత కాసేపు ముచ్చటించారు. ఆ వీడియోను దేవీ శ్రీ తన ట్విట్టర్​ అకౌంట్​లో షేర్​ చేశారు. "నా సంగీత దేవుడిని కలిశాను. జాతీయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయన ఆశీస్సులతో పాటు శుభాకాంక్షలను అందుకున్నాను. నా ప్రియమైన ఇసై జ్ఞాని ఇళయరాజా సర్​కు ధన్యావాదాలు. మీ ఇన్​స్పిరేషనే.. నన్ను జాతీయ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగేలా చేసింది" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తతం ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

Devi Sri Prasad Meets Ilayaraja : 1999లో తన మ్యూజిక్​ కెరీర్​ను స్టార్ట్​ చేసిన దేవి శ్రీ.. తన ట్యూన్స్​తో యూత్​ను తెగ ఆకట్టుకున్నారు. 'నీ కోసం', 'ఆనందం', 'ఖడ్గం', 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'మన్మథుడు', 'ఆర్య' 'వాల్తేరు వీరయ్య' లాంటి సినిమాలకు సంగీతాన్ని అందించిన ఆయన.. తన మ్యూజిక్​తో ఎన్నో బ్లాక్​ బస్టర్ ఆల్బమ్స్​ను ఇండస్ట్రీకి అందించారు. ఇక గతేడాది విడుదలైన​ ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాలకు తన మ్యూజిక్ అందించారు. ఇక 2021లో పుష్ప సినిమాకు ఆయన కట్టిన బాణీలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. శ్రీ వల్లి, ఊ అంటావా మావా, సామి సామి లాంటి సాంగ్స్​ సోషల్ మీడియాలో సెన్సేషన్​ క్రియేట్​ చేశాయి. ఇక ఈ సినిమాకుగాను ఆయన తాజాగా ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీప్రసాద్ జాతీయ అవార్డును అందుకున్నారు.

69 National Award Winners : భారతీయ చలనచిత్ర రంగం ఎంతగానో ఎదురుచూసిన 69 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2021కు గాను సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో 2021 సంవత్సరానికి 281 ఫీచర్‌ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది.

ఇందులో భాగంగా బెస్ట్​ ఫీచర్​ ఫిల్మ్​ అవార్డును 'రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్​' సినిమా దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, ఉత్తమ నటిగా ఆలియా భట్​, కృతిసనన్​ ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డులు ప్రకటించిన వేళ సినీ ఇండస్ట్రీలో సంబరాలు మొదలయ్యాయి. సుమారు 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విజ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ క్రమంలో బెస్ట్​ ఫీచర్​ ఫిల్మ్​ అవార్డును 'రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్​' సినిమా దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, ఉత్తమ నటిగా ఆలియా భట్​, కృతిసనన్​ ఎంపికయ్యారు. ఈ క్రమంలో అవార్డు విన్నర్స్​తో పాటు వారి ఫ్యాన్స్ సంబరాలు చేసుకోగా.. పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నేషనల్ అవార్డ్స్​ విన్నర్స్​కు విషెస్​ తెలుపుతున్నారు.

Last Updated :Aug 26, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.