తెలంగాణ

telangana

Bandi Sanjay On Hyderabad Drugs: 'తెరాస నేతల దోస్తీతోనే డ్రగ్స్ దందా!'

By

Published : Apr 8, 2022, 7:03 PM IST

Bandi Sanjay On Hyderabad Drugs: హైదరాబాద్​లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో డ్రగ్స్​కు హైదరాబాద్​ అడ్డాగా మారిందని ఆరోపించారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay On Hyderabad Drugs: హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ తెరాస నేతల హస్తం ఉన్నందునే డ్రగ్స్‌ దందా నడుస్తోందన్నారు. డ్రగ్స్‌పై సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్న సంజయ్... పంజాబ్‌లో ప్రభుత్వం కూలేందుకు కారణం డ్రగ్స్‌ దందానే అని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్‌ దందా విచ్చలవిడిగా నడుస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. డ్రగ్స్ తీసుకున్నారని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 15 మందిని తొలగించిన అంశాన్ని ప్రస్తావించారు.

వెయ్యి మందితో డ్రగ్స్‌ నిర్మూలిస్తామని గతంలో ప్రకటించారని... రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2015 నాటి డ్రగ్స్‌ కేసు విచారణను మరుగున పడేశారని మండిపడ్డారు. డ్రగ్స్‌ కేసులో కెల్విన్‌ను అరెస్టు చేసి విచారించారని... కొందరి పేర్లు లీక్‌ చేసినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. డ్రగ్స్ కేసు వివరాలు అందించాలని ఈడీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని... అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈడీకి అన్ని ఆధారాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్లు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే తిరిగి హైకోర్టును ఆశ్రయించాలని చెప్పిందని పేర్కొన్నారు. ఆధారాలు ఇవ్వనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసిందన్నారు.

హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా నడుస్తోంది. తెరాస నేతల హస్తం ఉన్నందునే డ్రగ్స్‌ దందా నడుస్తోంది. డ్రగ్స్‌పై సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. పంజాబ్‌లో ప్రభుత్వం కూలేందుకు కారణం డ్రగ్స్‌ దందానే. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్‌ దందా విచ్చలవిడిగా నడుస్తోంది. డ్రగ్స్ తీసుకున్నారని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 15 మందిని తొలగించారు. వెయ్యి మందితో డ్రగ్స్‌ నిర్మూలిస్తామని గతంలో ప్రకటించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలిస్తామన్న హామీ ఏమైంది? 2015 నాటి డ్రగ్స్‌ కేసు విచారణను మరుగున పడేశారు. డ్రగ్స్‌ కేసులో కెల్విన్‌ను అరెస్టు చేసి విచారించారు. కొందరి పేర్లు లీక్‌ చేసినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలేసి... మిగతావాళ్లపై కేసులు బనాయిస్తారు.

-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'తెరాస నేతల దోస్తీతోనే డ్రగ్స్ దందా!'

ABOUT THE AUTHOR

...view details