Hyderabad Pub Case: నిత్యం ఇరవైమందికి డ్రగ్స్‌ సరఫరా!.. ఎలా వస్తున్నాయి?

author img

By

Published : Apr 7, 2022, 4:33 AM IST

Hyderabad Pub Case: నిత్యం ఇరవైమందికి డ్రగ్స్‌ సరఫరా!.. ఎలా వస్తున్నాయి?

Hyderabad Pub Case: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పబ్ డ్రగ్స్‌ కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారు. పబ్బులోకి మాదకద్రవ్యాలు ఎలా వస్తున్నాయి....? ఎవరెవరూ వినియోగిస్తున్నారు..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 20 మంది నిత్యం పబ్బుకు వచ్చి డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితులు అభిషేక్‌,అనిల్‌ను కస్టడికీ అప్పగించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పరారీలో ఉన్న అర్జున్‌, కిరణ్‌రాజ్​లపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

నిత్యం ఇరవైమందికి డ్రగ్స్‌ సరఫరా!.. ఎలా వస్తున్నాయి?

Hyderabad Pub Case: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు అభిషేక్, అనిల్‌ కుమార్‌ల ఫోన్ల ద్వారా వినియోగదారుల వివరాలను తెలుసుకున్నారు. పబ్బులో మాదక ద్రవ్యాల ఏర్పాట్లపై వారికి సంకేతపదాలతో సంక్షిప్త సందేశాలు పంపుతున్నారని గుర్తించారు. వారాంతాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో డ్రగ్స్‌ తీసుకునేందుకు 20 మంది వస్తున్నారనే సమాచారాన్ని సేకరించారు. అందులో ముగ్గురిపై గతంలో కేసులు నమోదుకావటంతో... వారి కాల్‌డేటా రికార్డులు పరిశీలిస్తున్నారు. రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న అభిషేక్‌, అనిల్‌కుమార్‌లను వారం రోజులు కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టును బుధవారం అభ్యర్థించారు.

తెప్పించారా?.. తెస్తున్నాారా.. : పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌కు నిత్యం వస్తున్న 20 మంది కొన్ని నెలలుగా మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్లు పోలీసులు గుర్తించారు. అందులో కొందరు కొకైన్‌ను వేడిచేసి ఆవిరిని పీల్చుకుంటున్నారని..మరికొందరు అనుమానం రాకుండా తాగేపానీయాల్లో కలుపుకుంటున్నారని తెలుసుకున్నారు. ఒక గ్రామ్‌ కొకైన్‌ను ముగ్గురి నుంచి ఐదుగురు వినియోగిస్తున్నారని అంచనావేశారు. కొకైన్‌ను పబ్‌లోకి అనిల్, అభిషేక్‌లు తెస్తున్నారా? లేక వినియోగిస్తున్నవారే వారికి సమాచారం ఇచ్చి తీసుకొస్తున్నారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పబ్‌లోకి వెళ్లిన అనంతరం నిందితుల్లో ఒకరు తనను రక్షించాలంటూ ఇద్దరు పోలీస్ అధికారులకు ఫోన్లు చేశారని తెలుస్తోంది. ఆ అధికారులు నిందితుల నుంచి నెలకు లక్షన్నర నుంచి 2లక్షల వరకు మామూళ్లు తీసుకుంటున్నారని సమాచారం. అందుకే పుడింగ్​ అండ్‌ మింక్‌ పబ్‌లో మందుబాబుల మధ్య గొడవలు జరిగినా, కొట్టుకున్నా ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదని ఆరోపణలు వస్తున్నాయి.

విమానాశ్రాయాలకు సమాచారం: ఈ కేసులో నిందితులైన అర్జున్‌ వీరమాచనేని, కిరణ్‌రాజ్‌లపై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న వీరిద్దరూ దేశం విడిచి పారిపోకుండా పాస్‌పోర్టు వివరాలను తీసుకుని అన్ని విమానాశ్రాయాలకు సమాచారం పంపించారు. మరోవైపు పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్బులో ఆదివారం 4.64గ్రాముల కొకైన్‌ను గుర్తించామని.. ఇద్దరిని అరెస్ట్‌ చేసి మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పుడింగ్ పబ్ కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.