తెలంగాణ

telangana

Amit Shah Reached Hyderabad : హైదరాబాద్​లో అమిత్ షా.. పీవీ సింధుతో భేటీ..

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 8:44 PM IST

Updated : Sep 16, 2023, 10:58 PM IST

Amit Shah Reached Hyderabad : అమిత్ షా హైదరాబాద్ పర్యటన మొదలైంది. శంషాబాద్ ఎయిర్​పోర్ట్ చేరుకున్న అమిత్ షా.. తరువాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో సమావేశమయ్యారు. రేపు ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.

Telangana Liberation Day
Amit Shah

Amit Shah Reached Hyderabad Attend Telangana Liberation Day Tomorrow :హైదరాబాద్​లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు కిషన్​రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, విజయశాంతి, ధర్మపురి అర్వింద్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బ్యాండ్మిటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో సింధు తండ్రి పీవీ రమణ కూడా పాల్గొన్నారు.

Amit Shah Reached Hyderabad అమిత్ షాను కలిసిన పీవీ సింధు

అనంతరం జూబ్లీహిల్స్​లోని సీఆర్ఫీఎఫ్ కార్యాలయంలో.. రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్​ పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంపై అమిత్ షా ఆరా తీశారు.

Amit Shah Khammam Meeting : ఖమ్మంలో 'రైతు గోస- బీజేపీ భరోసా' సభతో.. రాష్ట్రంలో వేడేక్కిన రాజకీయం

రేపు ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. ఈ మధ్యలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో.. అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం.. కాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేస్తుండటం.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు వంటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Amit Shah Speech on TS Liberation : 'విమోచన వేడుకలు జరపడానికి ఎవరూ సాహసించలేదు'

KishanReddy on Sabha Arrangements at Parade Ground : మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో.. రేపటి అమిత్‌ షా సభ నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి (KishanReddy) పరిశీలించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​పై ఆయన​ మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని కేసీఆర్‌ చెప్పడం.. హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పరేడ్‌ మైదానంలో కేంద్ర అధికారిక కార్యక్రమాన్నిబీజేపీ సభగా హైదరాబాద్‌ పోలీసులు సర్కులర్‌ ఇవ్వడంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్‌ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించకుండా.. ఓట్ల రాజకీయాలు చేసి.. అమరుల త్యాగాలను మరుగునపరిచారని దుయ్యబట్టారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహించి.. హైదరాబాద్‌లో నిర్వహించకపోవడాన్ని కిషన్​రెడ్డి తప్పుబట్టారు.

Amit Shah Speech At Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : 'కాంగ్రెస్‌ 4జీ.. బీఆర్​ఎస్​ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలు'

Kishan Reddy on Telangana Liberation Day 2023 : 'తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాల్సిందే'

Last Updated :Sep 16, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details