ETV Bharat / state

Kishan Reddy on Telangana Liberation Day 2023 : 'తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాల్సిందే'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 1:31 PM IST

Kishan Reddy Speech
Telangana Liberation Festivals

Kishan Reddy on Telangana Liberation Day 2023 : తెలంగాణలో సెప్టెంబర్​ 17న విమోచన ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఉత్సవాల నిర్వహణ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లిస్‌ పార్టీని సంతృప్తి పరిచేందుకే విమోచన ఉత్సవాలు జరపడం లేదని ధ్వజమెత్తారు.

Kishan Reddy on Telangana Liberation Day 2023 తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాల్సిందే

Kishan Reddy on Telangana Liberation Day 2023 : తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలంటూ పోరాటం చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత విమోచన ఉత్సవాలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Kishan Reddy Fires on KCR Over Telangana Liberation Day : మజ్లిస్‌ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్.. విమోచన ఉత్సవాలు జరపడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ కలిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన ఉత్సవాలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

BJP on Telangana Liberation Day Celebrations : గత ఏడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్​ అధికారంగా విమోచన ఉత్సవాలు(Telangana Liberation Festivals) చేయడం లేదని ఆరోపించారు. నిజాం అరాచక పాలను నుంచి అప్పటి హైదరాబాద్​ సంస్షానం విమోచన సందర్భంగా సెప్టెంబర్​ 17న జాతీయ జెండా ఎగరవేశారని వివరించారు.

Kishan Reddy on Telangana Elections Schedule : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కిషన్‌రెడ్డి

Kishan Reddy on Home Guards Issues : 'ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలి'

చరిత్రలో జరిగిన ప్రతి ఘట్టానికి పండగ వాతావరణంతో జరుపుకోవడం ఆనవాయతీ అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గత 75 సంవత్సరాలుగా రాజీపడే ప్రసక్తే చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలు చేయాలని గత 25 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీజేపీ పోరాడుతుందని తెలిపారు. విమోచన దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

"గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాం. ఈ ఉత్సవాలను కేసీఆర్‌ అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదు. మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించలేదు. నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరేంది. బీజేపీ గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలంటూ పోరాటం చేస్తుంది. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. గతేడాది సెప్టెంబర్ 17న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలను’ నిర్వహించాం." - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Telangana Liberation Day 2023 : తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆర్​ఎస్​ పార్టీ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ విమోచన ఉత్సవాలు చేయాలని డిమాండ్​ చేసిందని అన్నారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు జరపట్లేదని నిలదీశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

Kishan Reddy Fires On CM KCR : 'ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారు'

kishan Reddy Comments on BRS : 'వంట గ్యాస్​, పెట్రో రేట్ల​పై మాట్లాడే నైతిక హక్కు బీఆర్​ఎస్​కు లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.