ETV Bharat / state

Amit Shah Speech At Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : 'కాంగ్రెస్‌ 4జీ.. బీఆర్​ఎస్​ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలు'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 5:25 PM IST

Updated : Aug 27, 2023, 6:59 PM IST

Amit Shah Speech At Rythu Gosa BJP Bharosa
Rythu Gosa BJP Bharosa Sabha

Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ లేదా కేటీఆర్​ సీఎం కారని.. బీజేపీ నేత సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్​ పని చేస్తే.. కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్​ఎస్​ పని చేస్తుందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతుగోస బీఆర్​ఎస్​ భరోసా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. ప్రసంగించారు.

Rythu Gosa BJP Bharosa Sabha In Khammam : కాంగ్రెస్​ 4జీ.. బీఆర్​ఎస్​ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amith Shah) ఎద్దేవా చేశారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్​ పని చేస్తే.. కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్​ఎస్​ పని చేస్తుందని ఆరోపణలు చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు గోస - బీజేపీ భరోసా(Rythu Gosa BJP Bharosa Sabha) బహిరంగ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన తిరుపతి వెంకటేశ్వరుడిని, స్తంభాద్రి లక్ష్మీనరసింహుడిని స్మరించుకుని ప్రసంగం ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ విమోచనకు పోరాడిన స్వాతంత్య్ర యోధులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభిస్తూ.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలపై విమర్శలు చేశారు.

"కేసీఆర్​ సర్కారును గద్దె దింపాలా వద్దా.. బీజేపీ సర్కారు కావాలా వద్దా?. కేసీఆర్​ సర్కారు తిరోగమనం ప్రారంభమైంది. ఇక నూకలు చెల్లాయి. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది. ఈసారి సీఎం అయ్యేది కేసీఆర్​ కాదు.. కేటీఆర్​ కాదు.. బీజేపీ నేత మాత్రమే. కేసీఆర్​ ప్రజలకు ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు. తెలంగాణలో ఈసారి అధికారంలోకి వచ్చేది మోదీ పార్టీ మాత్రమేనని" కేంద్రమంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు.

Telangana BJP MLA Candidates List : 35 మందితో BJP తొలి జాబితా.. సెప్టెంబరు 17 తర్వాతే ప్రకటన

Amith Shah Comments On CM KCR : హైదరాబాద్​ విముక్తి చెంది 75 ఏళ్లు నిండాయని.. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్​ నెరవేర్చలేకపోయారని అమిత్​ షా విమర్శించారు. ఒవైసీ పక్కన కూర్చుని సీఎం కేసీఆర్​.. తెలంగాణ అమరవీరులను అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. బీఆర్​ఎస్​ కారు స్టీరింగ్ ఇప్పుడు​ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని స్పష్టం చేశారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్​ ఉన్న కారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టులతో బీజేపీ నేతలను భయపెట్టవచ్చని.. ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని అన్నారు. అలా చేస్తే అది బీఆర్​ఎస్​కే నష్టమని తెలిపారు.

BJP Protests at Collectorates in Telangana : 'డబుల్​' ఆందోళనలు ఉద్ధృతం చేసిన బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి

Amit Shah Speech At Rythu Gosa BJP Bharosa Sabha In Khammam కాంగ్రెస్‌ 4జీ.. బీఆర్​ఎస్​ 2జీ.. ఎంఐఎం 3జీ పార్టీలు

"కేసీఆర్​ కారు స్టీరింగ్​ ఇప్పుడు ఎంఐఎం పార్టీ చేతిలో ఉంది. ఎంఐఎం చేతిలో స్టీరింగ్​ ఉన్న కారు మనకు కావాలా?. అరెస్టులతో బీజేపీని భయపెట్టాలని చూశారు. బండి సంజయ్​, ఈటల రాజేందర్​ను అరెస్టు చేయాలనుకున్నారు. ఈటల రాజేందర్​ను అసెంబ్లీలో అవమానించారు. ఈసారి సీఎం అయ్యేది కేసీఆర్​.. కేటీఆర్​ కాదు. బీజేపీ నేతనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు." - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

BJP Public Meeting In Khammam : భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని.. అలాంటిది శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్​ విస్మరించారని కేంద్రమంత్రి అమిత్​ షా మండిపడ్డారు. కేసీఆర్​ కారు భద్రాచలం వరకు వెళుతుంది.. కానీ ఆలయం వరకు వెళ్లదని ఎద్దేవా చేశారు. ఇక గుర్తుపెట్టుకోండి.. ఇక మీ కారు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరికలు పంపారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు లక్ష్మణ్​, హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వంటి ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.

Kishan Reddy Speech in BJP Public Meeting : 'బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌.. ఈ మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే'

Kishan Reddy Fires on Kharge Chevella Speech : 'చేవెళ్ల సభలో ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే'

Last Updated :Aug 27, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.