తెలంగాణ

telangana

ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు

By

Published : Jul 18, 2020, 5:06 PM IST

ఏపీలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. తాజాగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 3,963 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఏపీలో మెుత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది.

ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు
ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు

ఏపీలో కరోనా బాధితల వివరాలు

ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. కొత్తగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 3,963 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఏపీలో మెుత్తం కేసుల సంఖ్య 44,609కి చేరింది. కరోనాతో మరో 52 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 586కు చేరింది.

తూర్పు గోదావరిలో 12, గుంటూరు జిల్లాలో 8, కృష్ణా 8, అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో 5, ప్రకాశం 4, నెల్లూరు 3, విశాఖ జిల్లాలో ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున వైరస్​కు బలయ్యారు.

ఏపీలో 22,260 మంది బాధితులు కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 21,763 మంది డిశ్ఛార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో 23,872 నమూనాలు పరీక్ష చేయగా... ఇప్పటి వరకూ రాష్ట్రంలో మెుత్తం 12.84 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details