తెలంగాణ

telangana

వరద కారణంగా శ్రీశైలం రిజార్వాయర్​ 10 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 25, 2022, 7:10 PM IST

Srisailam Reservoir in ap: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీలోని శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,71,505క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam Reservoir
Srisailam Reservoir

Srisailam Reservoir in ap: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,71,505క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 2,79,370క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది.

జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా నమోదయింది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 65,920క్యూసెక్కుల నీటిని సాగర్​కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో స్థానికులు, సందర్శకులు, శ్రీశైలానికి వచ్చే భక్తులు నీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details