తెలంగాణ

telangana

Devi Sharan Navaratri 2021: భద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు

By

Published : Oct 6, 2021, 9:10 AM IST

Updated : Oct 6, 2021, 12:31 PM IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవా (Devi Sharan Navaratri celebrations)లు వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేడుకల్లో భాగంగా పంచామృతాలతో లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

Devi Sharan Navaratri 2021
శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు (Devi Sharan Navaratri celebrations) వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో (Devi Sharan Navaratri celebrations) మొదటి రోజైన నేడు అమ్మవారు... ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో ఆలయ అధికారులు నేటి నుంచి ఈ నెల 15 వరకు శ్రీ మద్రామాయణ పారాయణ మహా క్రతువును నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం బాలకాండ పారాయణం జరుగుతోందని నిర్వాహకులు వెల్లడించారు.

ఉదయం ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చి... సూర్యప్రభ వాహనంలో వేంచేపు చేసి రామాయణ పారాయణం నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకల్లో (Devi Sharan Navaratri celebrations)భాగంగా లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలంకరణ అనంతరం అమ్మవారు ఆదిలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మహిళలచే సామూహిక లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం దర్బార్ సేవ అనంతరం లక్ష్మణ సమేత సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించనున్నారు.

Last Updated :Oct 6, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details