తెలంగాణ

telangana

ఆసీస్ బోర్డుపై మరోసారి వార్నర్ ఫుల్​ ఫైర్​!

By

Published : Jun 3, 2023, 10:12 AM IST

Warner Ball tampering : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు(డబ్ల్యూటీసీ) ముందు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి అసహనం వ్యక్తం చేశాడు.

Warner
ఆసీస్ బోర్డుపై మరోసారి వార్నర్ ఫుల్​ ఫైర్​!

Warner Ball tampering : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు(డబ్ల్యూటీసీ) ముందు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడ్డాడు. తన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నాడు. అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

David Warner Cricket Australia :ఏం జరిగిందంటే.. 2018లో బాల్ టాంపరింగ్ విషయంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటే అతడి కెప్టెన్సీపై జీవితకాలం బ్యాన్​ విధించింది. అయితే ఈ టాంపరింగ్​లో వార్నర్​తో పాటు ఉన్న స్టీవ్‌ స్మిత్‌పై అంతగా కఠిన చర్యలేమీ తీసుకోలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో స్మిత్​.. మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యాడు. అలాగే ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో టీమ్​ను కూడా ముందుండి నడిపిస్తున్నాడు.

అయితే ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన వార్నర్​.. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన కెప్టెన్సీ బ్యాన్‌పై గతేడాది రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీ పానెల్​ను నియమించింది ఆ దేశ బోర్డు. అయితే ప్యానెల్‌.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తన రివ్యూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.

ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఈ విషయాలన్ని గుర్తుచేసుకుంటూ.. క్రికెట్‌ ఆస్ట్రేలియాపై మరోసారి అసహనం వ్యక్తం చేశాడు. "క్రికెట్‌ ఆస్ట్రేలియా నా పట్ల చూపిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని మార్చిపోవాలని అనుకుంటుంటే.. బోర్డు మాత్రం ఇంకా కొనసాగించాలనే ధోరణితో ఉంది. బోర్డులో ఒక్కరు కూడా పారదర్శకంగా లేరు. బోర్డులో నాయకత్వ లోపం సృష్టంగా కనిపిస్తోంది. నేను మర్చిపోదామని అనుకున్న ప్రతీసారి సీఏ దానిని బయటకు తీస్తూనే ఉంది. టెస్టు మ్యాచులు ఆడేటప్పుడు ప్రతిరోజు లాయర్ల నుంచి ఫోన్ కాల్స్​ వచ్చేవి. ఇదంతా నా వ్యక్తిగత ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. నా ఏకాగ్రతను దెబ్బతీసింది. అగౌరవంగా అనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో ఇదంతా ప్రారంభమైంది. దీనిపై నేను తీవ్ర అసహనానికి గురయ్యాను." అని వార్నర్​ పేర్కొన్నాడు.

WTC Final Teamindia vs Australia : కాగా, ఇటీవలే ఐపీఎల్ మజా ముగిసింది. ఈ నెల 7 నుంచి 12వ తేదీ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇంగ్లాండ్​లోని ఓవల్​ వేదికగా ఆస్ట్రేలియా-టీమ్​ఇండియా తలపడనున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌.. టెస్టు అభిమానులకు ఫుల్​ కిక్ ఇవ్వనుంది. ఈ పోరులో గెలిచిన జట్టుకు ఛాంపియన్‌షిప్‌ గదతో పాటు ప్రైజ్‌మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే అంతకుముందు ఆస్ట్రేలియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో అందుకున్న టీమ్‌ఇండియా.. మరోసారి అదే ఆధిపత్యం ప్రదర్శించాలని ఆశిస్తోంది.

ఇదీ చూడండి :

WTC Final 2023 : ఓవల్​లో వారిదే ఆధిపత్యం.. టీమ్​ఇండియా పేసర్లు ఏం చేస్తారో?

WTC Final​ డ్రా అయితే విజేేత ఎవరు? వర్షం పడితే ఎలా​? దాదా కామెంటరీ ఉందా?

WTC Finalలో టీమ్​ఇండియాకు బలం వీరే.. తుది జట్టు సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details