తెలంగాణ

telangana

రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పొడగింపు - బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్​మెంట్

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 2:12 PM IST

Updated : Nov 29, 2023, 4:40 PM IST

Rahul Dravid Coach Tenure Extension : ఇటీవల ముగిసిన టీమ్ఇండియా హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవిని.. బీసీసీఐ పొడగించింది. బుధవారం జరిగిన చర్చల్లో బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

rahul dravid coach tenure extension
rahul dravid coach tenure extension

Rahul Dravid Coach Tenure Extension :టీమ్ఇండియా హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవిని పొడగిస్తున్నట్లు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. అయితే రీసెంట్​గా ముగిసిన 2023 వరల్డ్​కప్​ టోర్నమెంట్​తో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పూర్తైంది. దీంతో రాహుల్​తో చర్చలు జరిపిన బీసీసీఐ.. ఏకగ్రీవంగా రాహుల్ పదవీ కాలాన్ని పొడగించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. టీమ్ఇండియాను అద్భుతంగా తీర్చిదిద్దడంలో రాహుల్ నైపుణ్యాలను బీసీసీఐ మెచ్చుకుంది. అలాగే ఎన్​ఏసీ హెడ్​గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్​ను సైతం బోర్డు ప్రశంసించింది. ఇక రాహుల్, లక్ష్మణ్.. ఇద్దరూ కలిసి టీమ్ఇండియాను అన్నివిధాలుగా ముందుకు తీసుకెళ్లాలని బీసీసీఐ సూచించింది. అలాగే ద్రవిడ్​తో పాటు పురుషుల జట్టు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్​ను కూడా బీసీసీఐ పొడగించింది.

ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగార్కర్‌ కూడా మద్దతుగా నిలిచారు. అలాగే ద్రవిడ్‌ను సౌతాఫ్రికా పర్యటనకు పంపించాలంటూ బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7 వరకు ద్రవిడ్​ అక్కడికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. "కాంట్రాక్ట్‌ కొనసాగింపుపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే, సౌతాఫ్రీకాతో సిరీస్‌ చాలా కీలకం. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు వెళ్లకూడదని ద్రవిడ్‌ భావిస్తే.. వన్డేల నాటికి భారత జట్టుతో కలవచ్చు" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌నే పంపాలని యాజమాన్యం బలంగా భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే లక్ష్మణ్‌కు అవకాశంపై స్పందిస్తూ.. అతడు ఇప్పటికే ఎన్‌సీఏ పనులతో బిజీగా ఉన్నాడని.. అండర్-19 వరల్డ్‌ కప్‌ కూడా దగ్గర పడుతున్న తరుణంలో సౌతాఫ్రికా పర్యటనకు పంపడం కష్టమేనని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్‌ ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

మరోవైపు ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు తొలిసారే కప్‌ సాధించిన విషయంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో పాటు భారత మాజీ పేసర్‌ ఆశిశ్ నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆశిశ్‌ను పొట్టి ఫార్మాట్‌కు భారత కోచ్‌గా బాధ్యతలు అప్పగించాలంటూ బీసీసీఐ భావించిందని సమాచారం. అయితే ఆశిశ్ మాత్రం ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించకపోవడం వల్ల ఈ విషయంలోనూ మళ్లీ రాహుల్‌ ద్రవిడ్‌ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై అటు ఆశిశ్​తో పాటు ఇటు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Rahul Dravid World Cup 2023 : 'మేం చేయగలిగింది అంతవరకే.. కోచ్​లు గ్రౌండ్​లోకి దిగలేరు కదా!'

టీమ్ఇండియాకు కొత్త హెడ్ కోచ్! - రాహుల్ స్థానంలో లక్ష్మణ్?

Last Updated :Nov 29, 2023, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details