ETV Bharat / sports

టీమ్ఇండియాకు కొత్త హెడ్ కోచ్! - రాహుల్ స్థానంలో లక్ష్మణ్?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 12:48 PM IST

Updated : Nov 23, 2023, 1:26 PM IST

Team India New Head Coach
Team India New Head Coach

Team India New Head Coach : టీమ్ఇండియా హెచ్​గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. కాంట్రాక్ట్ వరల్డ్​కప్​తో ముగిసింది. రెండేళ్లపాటు జట్టుకు కోచ్​గా సేవలందిచిన రాహుల్, స్థానంలో లక్ష్మణ్ రానున్నట్లు తెలుస్తోంది.

Team India New Head Coach : వన్డే వరల్డ్​కప్​తో టీమ్ఇండియా హెడ్​కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. రెండేళ్లపాటు కోచ్​గా ఉన్న రాహుల్.. ఆ పదవిలో కొనసాగుతాడా? లేదా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్.. కోచ్​గా బాధ్యతలు తీసుకుంటాడని కథనాలు వెలువడుతున్నాయి.

అయితే 2021లో హెడ్​కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్.. పలు ఐసీసీ టోర్నీల్లో జట్టులో కీలకంగా వ్యవహరించాడు. అతడు కోచ్​గా ఉన్న సమయంలో భారత్.. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2022 టీ20 సెమీఫైనల్, తాజాగా వన్డే వన్డే వరల్డ్​కప్ ఫైనల్ దాకా వెళ్లింది. అయితే రాహుల్ మళ్లీ కోచ్​గా కొనసాగడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ లక్ష్మణ్​ను కోచ్​గా నియమించవచ్చని తెలుస్తోంది. ఇక లక్ష్మణ్​తోపాటు మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సేహ్వాగ్, అనిల్ కుంబ్లే కూడా రేస్​లో ఉన్నారట. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ20 సిరీస్​కు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్​గా ఉన్న విషయం తెలిసిందే.

49 ఏళ్ల లక్ష్మణ్​ 2013లో కోచ్​గా కెరీర్​ను ప్రారంభించాడు. అప్పుడు ఐపీఎల్​ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు కోచ్​గా వ్యవహరించాడు. ఆ తర్వాత మెంటార్​గా అదే జట్టుకు సేవలందించి.. 2021లో ఎన్​సీఏ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించాడు. ఎన్​సీఏ డైరెక్టర్​గా ఉండడం వల్ల.. జట్టులోని ఆటగాళ్లు ఫిట్​నెస్​పై ఓ క్లారిటీ కూడా ఉంటుంది. గతంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ భారత్‌ - ఏతోపాటు సీనియర్‌ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే అండర్ - 19 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇదివరకు బంగాల్ క్రికెట్ అసోసియేషన్​లో బ్యాటింగ్​ కన్సల్టెంట్​గా కూడా సేవలందించాడు.

Laxman Test Career : లక్ష్మణ్ కెరీర్​లో టెస్టు క్రికెట్​లో అద్భుతంగా రాణించాడు. అతడు 134 టెస్టు మ్యాచ్​ల్లో 45.50 సగటుతో 8781 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. రెండుసార్లు 200+ స్కోర్లు నమోదు చేశాడు.

'అతడు ఒక గొప్ప లీడర్'.. పాండ్య కెప్టెన్సీపై VVS లక్ష్మణ్ కామెంట్స్​

రాహుల్ ద్రవిడ్ ఔట్.. టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

Last Updated :Nov 23, 2023, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.