తెలంగాణ

telangana

'ఉమ్రన్​ను ముందే ఎందుకు తీసుకోలేదు?'

By

Published : Oct 4, 2021, 1:10 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2021(IPL 2021 News)లో అరంగేట్రం చేశాడు సన్​రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్(umran malik ipl 2021). గంటకు 150.06 కి.మీ వేగంతో బంతి సంధించి క్రికెట్‌ పండితుల మన్ననలు పొందాడు. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. సన్​రైజర్స్ ముందుగానే అతడిని ఎందుకు ఆడించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

umran-malik-
ఉమ్రన్

ఎంతో నైపుణ్యం ఉన్న జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌(umran malik ipl 2021)ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంతకుముందే ఎందుకు ఆడించలేదని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్‌ ఐపీఎల్‌(IPL 2021 News)లో అరంగేట్రం చేశాడు. రెండో దశలో ప్రధాన పేసర్‌ టి.నటరాజన్‌ కరోనా బారిన పడటం వల్ల ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జట్టు యాజమాన్యం ఈ యువపేసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కోల్‌కతాపై తొలి మ్యాచ్‌ ఆడిన ఉమ్రాన్‌(umran malik ipl 2021).. ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బౌలింగ్‌ చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గంటకు 150.06 కి.మీ వేగంతో బంతి సంధించి క్రికెట్‌ పండితుల మన్ననలు పొందాడు. అతడి బౌలింగ్‌ చూసి మంత్ర ముగ్ధుడైన ఆశిష్‌ నెహ్రా.. సరైన బౌలర్లు లేక ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ జట్టు ఉమ్రాన్‌(umran malik ipl 2021)కు ముందే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

"హైదరాబాద్‌ టీమ్‌ ముందే ఉమ్రాన్‌(umran malik ipl 2021)ను ఆడించకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండో దశలో నటరాజన్‌కు రీప్లేస్‌గా అతడిని జట్టులోకి తీసుకొచ్చారు. ఈ జట్టు వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్నా అతడిని ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు. అతడి బౌలింగ్‌లో నైపుణ్యం ఉంది. అది మాత్రమే కాకుండా పేస్‌ బౌలింగ్‌కు సరిపడా యాక్షన్‌ ఉంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చినందున అతడెంతో దృఢంగా ఉన్నాడు. తన చేతి నుంచి బంతి దూసుకెళ్లే విధానం కూడా ఆకట్టుకుంది. భవిష్యత్‌లో అతడెంత ముందుకు వెళతాడో కాలమే నిర్ణయిస్తుంది. అతడి బౌలింగ్‌లో అద్భుమైన ప్రతిభ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడిని చూసి చాలా ముచ్చటేసింది" అని మాజీ పేసర్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

ఇవీ చూడండి: ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఎవరి అవకాశం ఎలా?

ABOUT THE AUTHOR

...view details