ETV Bharat / sports

IPL 2021 News: ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఎవరి అవకాశం ఎలా?

author img

By

Published : Oct 4, 2021, 12:21 PM IST

IPL 2021
ఐపీఎల్

ఐపీఎల్ 2021(IPl 2021 News) ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్​(ipl playoffs 2021)కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన చివరి స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్​-4 రేసులో ఎవరెవరి అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తుదిదశకు చేరుకుంటున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPl 2021 News)​ అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్(ipl playoffs 2021) బెర్తును ఖరారు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్​-3 జట్లుగా ఉన్నాయి. ఇక చివరి స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. కోల్​కతా నైట్​రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్​, పంజాబ్ కింగ్స్​కు ఈ ఆఖరి బెర్తు దక్కించుకునే వీలుంది. ఇందులో నెట్ రన్​రేట్ మెరుగ్గా ఉన్న కేకేఆర్​కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఓ లుక్కేద్దాం.

కోల్​కతా నైట్​రైడర్స్

తర్వాతి మ్యాచ్: అక్టోబర్ 7- రాజస్థాన్ రాయల్స్​తో పోటీ

ఆదివారం సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసు(kolkata knight riders playoff chances)లో మరింత ముందుకెళ్లింది. అక్టోబర్ 7న రాజస్థాన్ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో కేకేఆర్ గెలిస్తే వారి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారవుతుంది. ఈ జట్టు కనుక భారీ తేడాతో రాజస్థాన్​ను ఓడిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ఈ జట్టు ముందంజ వేస్తుంది.

పంజాబ్ కింగ్స్

తర్వాతి మ్యాచ్: అక్టోబర్ 7-చెన్నై సూపర్ కింగ్స్​తో పోరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని గల్లంతు చేసుకుంది. ఇక వీరు ప్లే ఆఫ్స్(punjab kings playoff chances) చేరడం మిగత ఫ్రాంచైజీల గెలుపోటములపై ఆధారపడి ఉంది. అక్టోబర్ 7న చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగే మ్యాచ్​లో వీరు గెలిచినా 14 పాయింట్లకు చేరుకోలేరు. కానీ చెన్నైపై ఈ జట్టు భారీ తేడాతో గెలిచి కేకేఆర్​.. రాజస్థాన్​పై ఓడిపోయి, మంబయి.. రాజస్థాన్​ను ఓడిస్తే ఈ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. ముంబయి, రాజస్థాన్ వారి మ్యాచ్​ల్లో భారీ తేడాతో ఓడిపోతేనే ఇది సాధ్యమవుతుంది. మొత్తానికి పంజాబ్ టాప్​-4లో నిలవాలంటే అద్భుతం జరగాలని చెప్పొచ్చు.

రాజస్థాన్ రాయల్స్

తర్వాతి మ్యాచ్​లు: అక్టోబర్ 5- ముంబయ ఇండియన్స్

అక్టోబర్ 7 - కోల్​కతా నైట్​రైడర్స్​తో పోరు

రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్(rajasthan royals playoff chances) అవకాశాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. వారు కనుక మిగిలిన చివరి రెండు మ్యాచ్​ల్లో కోల్​కతా నైట్​రైడర్స్​, ముంబయి ఇండియన్స్​ను ఓడిస్తే నెట్​రన్​రేట్​తో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్​కు అర్హత సాధిస్తారు. ఈ జట్టు అక్టోబర్ 5న ముంబయితో, 7న కోల్​కతాతో తలపడనుంది.

ముంబయి ఇండియన్స్

తర్వాతి మ్యాచ్​లు: అక్టోబర్ 5 - రాజస్థాన్ రాయల్స్

అక్టోబర్ 8 - సన్​రైజర్స్ హైదరాబాద్

ప్లే ఆఫ్స్(mumbai indians next match) రేసులో పోటీపడుతున్న మిగిలిన జట్లతో పోలిస్తే ముంబయి ఇండియన్స్​ నెట్​రేట్ (-0.453) మైనస్​లో ఉంది. ఈ జట్టు రాజస్థాన్ రాయల్స్​తో అక్టోబర్ 5న, సన్​రైజర్స్ హైదరాబాద్​తో 8న తలపడనుంది. వీరు టాప్-4కి వెళ్లాలంటే ఈ రెండు జట్లపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్​ తమ తర్వాతి మ్యాచ్​లో గెలిస్తే ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు గల్లంతనే చెప్పాలి.

ఇవీ చూడండి: 'ధోనీ నుంచి ఆ విషయం నేర్చుకోవాలనుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.