తెలంగాణ

telangana

'చెన్నై బ్యాట్స్​మెన్​కు గ్లూకోజ్ అవసరం'

By

Published : Sep 26, 2020, 12:10 PM IST

Updated : Sep 26, 2020, 2:08 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఈ జట్టు బ్యాట్స్​మెన్ కనబర్చిన బ్యాటింగ్ తీరుపట్ల మాజీలతో పాటు అభిమానులు నిరాశచెందారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

చెన్నై-దిల్లీ
'చెన్నై బ్యాట్స్​మెన్​కు గ్లూకోజ్ అవసరం అనుకుంటా'

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి చవిచూసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమై ఈ లీగ్​లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్​లో కాస్త పర్వాలేదనిపించినా.. బ్యాటింగ్​లో మాత్రం పూర్తిగా నిరాశపరిచారు సీఎస్కే ఆటగాళ్లు. ఈ క్రమంలో వారి బ్యాటింగ్​ టెస్టు మ్యాచ్​లా సాగిందంటూ విమర్శలూ వచ్చాయి. చెన్నై బ్యాటింగ్​పై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు.

"సీఎస్కే బ్యాట్స్​మన్ తడబడ్డారు. తదుపరి మ్యాచ్​లో మెరుగ్గా ఆడటానికి వారు గ్లూకోజ్ తీసుకుని రావాలేమో" అంటూ ట్వీట్ చేశాడు సెహ్వాగ్.

అయితే ఈ మ్యాచ్​లో ఓటమికి బ్యాటింగ్​ విభాగంలో సమతూకం లేకపోవడమే కారణమన్నాడు సీఎస్కే సారథి ధోనీ. రాయుడు లేకపోవడం వల్ల ఓడిపోయామని తెలిపాడు.

"రాయుడు లేకపోవడం వల్ల చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్‌ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌కాదు. తేమ లేనప్పటికీ వికెట్‌ నెమ్మదించింది. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడం వల్ల రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది" అని తెలిపాడు ధోనీ.

Last Updated :Sep 26, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details