తెలంగాణ

telangana

IND vs SA: లంచ్​ బ్రేక్.. దక్షిణాఫ్రికా స్కోరు 100/3

By

Published : Jan 12, 2022, 4:09 PM IST

Updated : Jan 12, 2022, 4:33 PM IST

IND vs SA 3rd test Day 2: భారత్​తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో తొలి సెషన్​ పూర్తయ్యే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. ప్రస్తుతం క్రీజులో పీటర్సన్(40), వాన్​ డర్ డసెన్(17) ఉన్నారు.

IND vs SA
భారత్, దక్షిణాఫ్రికా

IND vs SA 3rd test Day 2: కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి త్వరగానే రెండు వికెట్లను పడగొట్టినా తర్వాత వచ్చిన బ్యాటర్లు క్రీజ్‌లో పాతుకుపోయారు. దీంతో రెండో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజ్‌లో పీటర్సన్‌ (40), డస్సెన్ (17) ఉన్నారు. వీరిద్దరూ కలిసి అర్ధశతక (54) భాగస్వామ్యం నిర్మించారు.

భారత బౌలర్లు బుమ్రా 2, షమీ ఒక వికెట్ తీశారు. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ఇంకా 123 పరుగుల వెనుకంజలో ఉంది.

రెండో బంతికే వికెట్‌

ఓవర్‌నైట్‌ 17/1 స్కోరుతో ఆటను ప్రారంభించిన సఫారీలకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ బుమ్రా వేసిన రెండో బంతికే మార్‌క్రమ్‌ (8) క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న కేశవ్‌ మహరాజ్‌ (25) కాసేపు వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కీగన్‌ పీటర్సెన్, డస్సెన్ క్రీజ్‌లో కుదురుకుని పరుగులు రాబడుతున్నారు. మరో వికెట్‌ పడనీయకుండా తొలి సెషన్‌ను ముగించారు.

ఇదీ చదవండి:

IND Vs SA: కోహ్లీ మరో రికార్డు.. సచిన్ తర్వాత రెండో స్థానంలో

IND Vs SA: తొలిరోజు ఆట పూర్తి.. దక్షిణాఫ్రికా స్కోరు 17/1

Last Updated :Jan 12, 2022, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details