ETV Bharat / sports

సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన 'ఇంపాక్ట్‌' ప్లేయర్‌ రూల్ - IPL 2024 Shahbaz Ahmed

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 10:35 AM IST

Sunrisers Hyderabad Impact Player Shahbaz Ahmed : ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్‌లో సన్​రైజర్స్​ విజయం సాధించడంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బౌలర్‌ షాబాజ్‌ కీలక పాత్ర పోషించాడు. పూర్తి వివరాలు స్టోరీలో.

Source The Associated Press
Shahbaz Ahmed (Source The Associated Press)

Sunrisers Hyderabad Impact Player Shahbaz Ahmed : ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో క్వాలిఫయర్‌లో పుంజుకుని అదిరే ప్రదర్శన చేసింది. చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్‌లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్​ను ఓడించింది. దీంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు తొలి క్వాలిఫయర్‌లో తమ ఓటమి రుచి చూపించిన కోల్​కతాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ రెండో క్వాలిఫయర్‌లో సన్​రైజర్స్​ విజయానికి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

ఈ సీజన్​లోని చాలా మ్యాచ్‌లలో షాబాజ్‌ అహ్మద్‌ తుది జట్టులో ఆడాడు. కానీ అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అతడు జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. 120/6తో ఉన్నదశలో బ్యాటింగ్‌కు దిగి 18 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. బంతికో పరుగు చొప్పున చేస్తూ హెన్రిచ్ క్లాసెన్‌కు మంచి సహకారం అందించాడు. మరో వికెట్ పడకుండా ఆచితూడి ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీంతో మరో ఎండ్‌లో క్లాసెన్‌ వేగంగా పరుగులు చేయగలిగాడు.

ఇక స్పిన్‌కు బాగా సహకరించిన చెపాక్‌ పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నాడు షాబాజ్‌ అహ్మద్‌. కీలకమైన మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను గట్టిగా దెబ్బ కొట్టాడు. రాజస్థాన్​ 65/1తో బలమైన స్థితిలో ఉన్న సమయంలో యశస్వి జైశ్వాల్​ను(42) ఔట్‌ చేసి మ్యాచ్​ను మలుపు తిప్పాడు.రియాన్ పరాగ్​తో(6) పాటు ఆర్​ అశ్విన్​ను(0) కూడా పెవిలియన్​ చేర్చాడు. అలా తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.

మ్యాచ్​ అనంతరం షాబాజ్​​​ అహ్మద్​ మాట్లాడుతూ - "మ్యాచ్‌కు ముందు మా కెప్టెన్‌, కోచ్‌ ఒకటే మాట చెప్పారు. పరిస్థితి ఆధారంగా నన్ను పంపిస్తానన్నారు. బ్యాటింగ్​ లైనప్ కుప్పకూలినప్పుడు లోయర్​ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ పంపిస్తామని సిద్ధంగా ఉండాలన్నారు. ఇక క్రీజులోకి రాగానే అవేశ్‌ ఖాన్, సందీప్ శర్మ బౌలింగ్​ చూశాను. పిచ్‌ మ్యాజిక్‌ చేసేలా అనిపించింది. ఇలాంటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ అవార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఫైనల్‌లోనూ గెలిచి భారీగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటాం. ముందుంది అసలు సమరం" అని షాబాజ్‌ పేర్కొన్నాడు.

పాట్ కమిన్స్ అరుదైన ఘనత - RR x SRH​ మ్యాచ్​లో నమోదైన రికార్డులివే! - IPL 2024 SRH Final

గెంతులేస్తూ కావ్య మారన్ సెలబ్రేషన్స్ - ఏడ్చేసిన రాజస్థాన్ లేడీ ఫ్యాన్! - Sunrisers Kavya Maran Celebrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.