ETV Bharat / entertainment

6వేల కేజీల బరువు- రూ.7 కోట్ల బడ్జెట్- 'బుజ్జి' కోసం ఇంజినీర్​ నాగ్! - Kalki Bujji

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 4:39 PM IST

Updated : May 25, 2024, 4:53 PM IST

Kalki Bujji: 'కల్కి 2898 ఏడీ' సినిమా నుంచి తాజాగా బుజ్జి (కారు) రిలీజైంది. మరి ఈ బుజ్జి ప్రత్యేకతలు, దాని గురించి మరిన్ని విషయాలు మీ కోసం.

Kalki Bujji
Kalki Bujji (Source: ETV Bharat)

Kalki Bujji: 'బుజ్జి బుజ్జి బుజ్జి' ప్రస్తుతం సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇదే. రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ 'కల్కి' కోసం డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ డిజైన్ చేసిన బుజ్జి (ఓ కారు)ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్​లో ఉంది. రీసెంట్​గా యంగ్ హీరో నాగచైతన్య కూడా ఆ కార్​ను రైడ్ చేశాడు. మరి ఆ బుజ్జికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

  • ఈ కారును డిజైన్ చేయడానికి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మహీంద్రా, జయం మోటార్స్​ సంస్థలు సహకరించాయి. దీని కొత్తగా మూడు టైర్లతో తయారు చేశారు. దాదాపు రూ. 7కోట్ల ఖర్చయ్యిందట.
  • ఈ కారు డిజైన్ కోసం డైరెక్టర్ అశ్విన్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదివారంట. వందల స్కెచ్​లు కూడా వేసినట్లు తెలిసింది.
  • కారుకు 34.5 అంగుళాల సైజు కలిగిన రిమ్స్‌ను అమర్చగా, ప్రత్యేకంగా సియట్‌ వాళ్లు టైర్లను డిజైన్‌ చేసి ఇచ్చారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్‌తో అల్యూమినియం అలాయ్‌ వీల్స్‌ను తయారు చేశారు.
  • కారు బరువు మొత్తం ఆరు టన్నులు. ఒక్కో టైర్​కు ఉన్న స్వింగ్‌ ఆర్మ్‌ బరువు దాదాపు టన్ను ఉంటుందట.
  • కారు మొత్తం పొడవు 6075 MM; వెడల్పు 3380 MM; ఎత్తు 2186 MM. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 180 MM
  • రియర్‌ వీల్‌ సస్పెన్షన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్ప్రింగ్‌లను అమర్చి ఎటు కావాలంటే అటు తిరిగేలా చక్రాలను డిజైన్‌ చేశారు.
  • కారుపైన ఉన్న డోర్‌ను దృఢమైన ఫైబర్‌ గ్లాస్‌తో తయారు చేశారు.
  • బుజ్జి కారును సులువుగా నడిపేందుకు ఎలక్ట్రో హైడ్రాలిక్‌ స్ట్రీరింగ్‌ను అమర్చారు. ఇది కారులోని ఎలక్ట్రిక్‌ మోటార్‌కు, అది రియర్‌ వీల్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది.
  • ఆరు టన్నుల బరువు కలిగిన ఈ వాహనం కదలాలంటే భారీగానే శక్తి కావాలి. ఇందులో అమర్చిన ఇంజిన్‌ 94 కిలోవాట్‌ పీక్‌ పవర్‌, 9800 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 47 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ను కారులో అమర్చారు.
  • ఈ బుజ్జికి మరో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ కారు సినిమాలో మాట్లాడుతుంది. ఈ బుజ్జికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది.

ఈ సినిమా జూన్ 27న వరల్డ్​ వైడ్​గా థియేటర్లలో రాబోతుంది. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​, లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది.

ప్రభాస్ 'బుజ్జి'పై నాగచైతన్య స్పెషల్ రైడ్​ - ఇంకా షాక్‌లోనే ఉన్నానంటూ పోస్ట్! - Naga chaitanya Kalki Bujji Car

'బుజ్జి' ప్రత్యేకతలివే - వామ్మో ఈ కారు కోసమే అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? - Kalki 2898 AD Bujji Car Features

Last Updated : May 25, 2024, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.